News October 25, 2025
ADB: మనం వెళ్లే బస్సు భద్రమేనా..?

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. ఏడాదిన్నర కాలంలో నిర్మల్ ఘాట్, గుడిహత్నూర్ జాతీయ రహదారిపై డ్రైవర్ల నిర్లక్ష్యం, ఓవర్‌లోడింగ్ కారణంగా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రోజూ కేవలం ADB నుంచి HYD వరకు 50కి పైగా ప్రైవేట్ బస్సు సర్వీసులు నడుస్తాయి. తాజాగా, కర్నూలు వద్ద 19 మంది సజీవ దహనం కావడంతో, ప్రైవేట్ బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల నియంత్రణపై అధికారులు దృష్టిసారించాలి.
Similar News
News October 28, 2025
అమలాపురం: ACB అధికారుల నంబర్ ఇదే..!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏసీబీ శాఖ ఆధ్వర్యంలో అమలాపురంలో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అవినీతి శాఖ రూపొందించిన పోస్టర్లను జిల్లా రెవెన్యూ, రవాణా శాఖ, తహశీల్దార్, పోలీస్ స్టేషన్, ట్రెజరీ కార్యాలయం వద్ద అతికించారు. ఏ అధికారైనా లంచం డిమాండ్ చేస్తే 9440446160కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలని ఏసీబీ అధికారులు కోరారు.
News October 28, 2025
ఈ 12 జిల్లాల్లో నేటి నుంచే రేషన్ పంపిణీ

AP: తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఇవాళ్టి నుంచే రేషన్ పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ప.గో, కృష్ణా, బాపట్ల, కాకినాడ, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లోని రేషన్ లబ్ధిదారులకు సరుకులు అందజేయనున్నారు. అటు ఈ 12 జిల్లాల్లో రాబోయే 3 రోజులపాటు పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా కంపెనీలతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
News October 28, 2025
కోనసీమ: లైసెన్స్ స్లాట్లను మార్చుకోండి..!

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 28, 29, 30, 31వ తేదీల్లో లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు వచ్చే వారానికి మార్చుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సూచించారు. ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ కారణంగా వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సిటిజెన్ లెవెల్‌లో స్లాట్స్ మార్చుకునే సదుపాయం తెచ్చామని చెప్పారు.


