News October 25, 2025
ప్రభుత్వ స్థలాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయండి: బల్దియా కమిషనర్

ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా ఫెన్సింగ్ (కంచెలు) ఏర్పాటు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులకు సూచించారు. శనివారం నగర పరిధిలోని గొర్రెకుంట కీర్తినగర్ కోటిలింగాల ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి శానిటేషన్‌తో పాటు టౌన్ ప్లానింగ్‌కు చెందిన అంశాలను పరిశీలించి సమర్థవంతంగా చేపట్టేందుకు అధికారులకు సూచనలు చేశారు.
Similar News
News October 28, 2025
ఉదయాన్నే టీ, కాఫీ తాగుతున్నారా?

ఉదయం లేవగానే కాఫీ, టీ తాగితేనే కానీ చాలామంది కాలకృత్యాలు పూర్తి చేయలేరు. అయితే ఇదెంతమాత్రం మంచిది కాదంటున్నారు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.సుశీల్ శర్మ. ‘టీ, కాఫీలు ముందు పెద్దపేగును కదిలిస్తాయి. తరువాత అదే అలవాటుగా మారి చివరకు పేగుల సహజ రిథమ్‌ను దెబ్బతీస్తాయి. ఆపై పొట్టలో ఇరిటేట్ చేస్తాయి. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి’ అని పేర్కొన్నారు. వాటి బదులు గోరువెచ్చని నీటిని సేవించాలని సూచించారు.
News October 28, 2025
అడుగున ఎరువుకొద్దీ పైన బంగారం

ఏ పొలానికైనా ఎరువులే బలం అని చెప్పేందుకు ఈ సామెతను ఉపయోగిస్తారు. పొలం పనులలో భూమికి ఎరువు వేయడం కష్టమైనా, సరైన ఎరువు ఫలితంగా బంగారంలాంటి పంట పండి మనకు సంతోషం కలుగుతుంది. అలాగే, కష్టపడి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ఈ సామెత చెబుతుంది.
News October 28, 2025
అమలాపురం: ACB అధికారుల నంబర్ ఇదే..!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏసీబీ శాఖ ఆధ్వర్యంలో అమలాపురంలో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అవినీతి శాఖ రూపొందించిన పోస్టర్లను జిల్లా రెవెన్యూ, రవాణా శాఖ, తహశీల్దార్, పోలీస్ స్టేషన్, ట్రెజరీ కార్యాలయం వద్ద అతికించారు. ఏ అధికారైనా లంచం డిమాండ్ చేస్తే 9440446160కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలని ఏసీబీ అధికారులు కోరారు.


