News October 25, 2025
RO-KO షో.. రికార్డులు బద్దలు

* ODIల్లో మోస్ట్ 150+ పార్ట్‌నర్‌షిప్స్: సచిన్-గంగూలీ రికార్డు సమం చేసిన RO-KO(12)
* ODIs+T20Isలో అత్యధిక రన్స్ చేసిన కోహ్లీ(18,443*). సచిన్ రికార్డు బద్దలు(18,436)
* వన్డేల్లో సచిన్ తర్వాత సెకండ్ హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా కోహ్లీ(14,255*)
* 101 ఇన్నింగ్స్‌ల్లో 19సార్లు 100+ భాగస్వామ్యాలు నెలకొల్పిన RO-KO
* ఇంటర్నేషనల్ క్రికెట్లో హిట్‌మ్యాన్ 50* సెంచరీలు
* ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్: రోహిత్
Similar News
News October 28, 2025
ఉదయాన్నే టీ, కాఫీ తాగుతున్నారా?

ఉదయం లేవగానే కాఫీ, టీ తాగితేనే కానీ చాలామంది కాలకృత్యాలు పూర్తి చేయలేరు. అయితే ఇదెంతమాత్రం మంచిది కాదంటున్నారు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.సుశీల్ శర్మ. ‘టీ, కాఫీలు ముందు పెద్దపేగును కదిలిస్తాయి. తరువాత అదే అలవాటుగా మారి చివరకు పేగుల సహజ రిథమ్‌ను దెబ్బతీస్తాయి. ఆపై పొట్టలో ఇరిటేట్ చేస్తాయి. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి’ అని పేర్కొన్నారు. వాటి బదులు గోరువెచ్చని నీటిని సేవించాలని సూచించారు.
News October 28, 2025
అడుగున ఎరువుకొద్దీ పైన బంగారం

ఏ పొలానికైనా ఎరువులే బలం అని చెప్పేందుకు ఈ సామెతను ఉపయోగిస్తారు. పొలం పనులలో భూమికి ఎరువు వేయడం కష్టమైనా, సరైన ఎరువు ఫలితంగా బంగారంలాంటి పంట పండి మనకు సంతోషం కలుగుతుంది. అలాగే, కష్టపడి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ఈ సామెత చెబుతుంది.
News October 28, 2025
ఈ 12 జిల్లాల్లో నేటి నుంచే రేషన్ పంపిణీ

AP: తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఇవాళ్టి నుంచే రేషన్ పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ప.గో, కృష్ణా, బాపట్ల, కాకినాడ, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లోని రేషన్ లబ్ధిదారులకు సరుకులు అందజేయనున్నారు. అటు ఈ 12 జిల్లాల్లో రాబోయే 3 రోజులపాటు పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా కంపెనీలతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.


