News October 25, 2025
వనపర్తి: ఇంటర్ విద్యార్థుల నుంచి గుర్తింపు, గ్రీన్ ఫండ్ ఫీజు వసూలు

ప్రభుత్వ సెక్టార్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల నుంచి గుర్తింపు ఫీజు రూ.220,గ్రీన్ ఫండ్ ఫీజు రూ.15 చొప్పున వసూలు చేయాలని ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసిందని DIEO ఎర్ర అంజయ్య తెలిపారు. ఈ మొత్తాన్ని ఈనెల 24 నుంచి 31లోపు ఇంటర్ బోర్డుకు CGG వెబ్ పోర్టల్ tgbie.cgg.gov.inలో చెల్లింపు గేట్‌వే ఉపయోగించి జమ చేయాలని కాలేజీ ప్రిన్సిపల్‌లను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
Similar News
News October 28, 2025
తుఫాను ఎఫెక్ట్.. పలు విమాన సర్వీసులు రద్దు

AP: మొంథా తుఫాను ప్రభావంతో నేడు విశాఖ, విజయవాడ విమానాశ్రయాలకు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిరిండియా, ఇండిగో, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫైట్లు నిలిచిపోనున్నాయి. అయితే ఇండిగో ఫైట్లు 10.45AM వరకు, ఢిల్లీ-VJA సర్వీసులు నడుస్తాయని VJA ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. అటు ఢిల్లీ, భువనేశ్వర్, VJA, రాయ్‌పూర్, హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖకు వెళ్లే సర్వీసులన్నీ ఆగిపోనున్నాయి.
News October 28, 2025
సిద్ధంగా ఉంచండి: కలెక్టర్

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ సిరి పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలకు పంపేందుకు అసరమైన ఉద్యోగులు, సిబ్బంది, సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రమాదకర వంతెనల వద్ద సిబ్బందిని ఉంచడంతో పాటు వెంటనే మరమ్మతులు చేసేందుకు గుత్తేదారులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
News October 28, 2025
శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే 20 రైళ్లు రద్దు

తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే 20 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్టు రైల్వే జీఎం పరమేశ్వర ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రయాణికుల భద్రత మేరకు అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులను సూచించారు.


