News October 25, 2025

ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించండి: CBN

image

AP: మొంథా తుఫాను దూసుకొస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని CM CBN ఆదేశించారు. తీర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ‘జిల్లాలకు ఇన్ఛార్జిల్ని వేయాలి. అవసరమైతే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలి. కాకినాడలో ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ సేవల్ని అందించాలి. 100 KM వేగంతో గాలులు, 100MM మేర వర్షాలు పడతాయి. ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News October 26, 2025

విమానాన్ని ఢీకొట్టిన పక్షుల గుంపు.. తప్పిన ప్రమాదం

image

సౌదీ అరేబియాకు చెందిన SV340(Boeing 777-300) విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. జెడ్డా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా పక్షుల గుంపు ఢీకొట్టింది. అక్కడ పక్షుల రక్తపు మరకలు అంటుకున్నాయి. ముందరి భాగం దెబ్బతింది. ల్యాండింగ్ సేఫ్టీనే అని పైలట్ నిర్ధారించుకుని ల్యాండ్ చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు గుర్తించారు. పక్షులు ఇంజిన్‌లోకి వెళ్లి ఉంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేది.

News October 26, 2025

‘కాలానమక్’ వరి రకం ప్రత్యేకతలు ఇవే..

image

కాలానమక్ దేశీ వరి రకం పంట కాలం 130 నుంచి 140 రోజులు. 3 నుంచి 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ బియ్యంలో ఉండే అధిక ప్రొటీన్లు, ఐరన్, జింక్, ఇతర సూక్ష్మపోషకాలు మన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఈ బియ్యానికి 2013లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. ఔషద గుణాలు కలిగిన ఈ బియ్యం తినడం వల్ల క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచవచ్చంటున్నారు నిపుణులు.

News October 26, 2025

ఇతిహాసాలు క్విజ్ – 47

image

1. దశరథ మహారాజు కుల గురువు ఎవరు?
2. ఉలూచి, అర్జునుల కుమారుడు ఎవరు?
3. దేవతల తల్లి ఎవరు?
4. శివుడు నర్తించే రూపం పేరేంటి?
5. సత్య హరిశ్చంద్రుడి భార్య పేరేంటి?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>