News October 25, 2025
ధర్మవరంలో ఈ నెల 27న ఫ్లోర్ బాల్ జిల్లా ఎంపిక పోటీలు

జిల్లాలోని ఈ నెల 27న ఫ్లోర్ బాల్ జిల్లా ఎంపిక పోటీలు ధర్మవరం బిఎస్ఆర్ మున్సిపల్ స్కూల్ మైదానంలో నిర్వహిస్తామని శ్రీ సత్యసాయి జిల్లా ఫ్లోర్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ ప్రసాద్ తెలిపారు. అండర్-12, 17 విభాగంలోని బాల, బాలికలకు పోటీలు జరుగుతాయన్నారు. ఎంపికైన క్రీడాకారులను నవంబర్ 2న నరసరావుపేటలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News October 26, 2025
నిడదవోలు: నకిలీ పోలీసు అరెస్ట్

పోలీసునని చెప్పుకుంటూ చోరీలకు పాల్పడిన వైజాగ్‌కు చెందిన ఆదిరెడ్డి అప్పారావును శనివారం అరెస్ట్ చేసినట్లు సమీస్ర గూడెం ఎస్ఐ బాలాజీ సుందర్ రావు తెలిపారు. శంకరాపురంలో రెండు కేసుల్లో ఇతను నిందితుడన్నారు. నిందితుడి నుంచి రెండు ఉంగరాలు, ఒక బంగారు గొలుసు, బెలోనో కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇతనిపై మొత్తం 14 పాత కేసులు ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు.
News October 26, 2025
GNT: ఆయన స్వరమే.. రజినీకాంత్ మాట..!

నేపథ్య గాయకుడు, డబ్బింగ్ కళాకారుడు, నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు నాగూర్ బాబు (మనో) సత్తెనపల్లిలో జన్మించారు. గాయకుడిగా పరిచయం అవ్వకముందే నీడ అనే చిత్రంలో బాలనటుడిగా కనిపించారు. ఇళయరాజా ఆయన పేరును మనోగా మార్చారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో సుమారు పాతికవేలకు పైగా పాటలు పాడాడు. రజనీకాంత్ తెలుగు చిత్రాలకు ఆయనకు డబ్బింగ్ చెప్పి మెప్పు పొందాడు. నేడు ఆయన పుట్టిన రోజు.
News October 26, 2025
రెంటచింతల: గొర్రెలపైకి దూసుకెళ్లిన లారీ

రెంటచింతల బైపాస్ వద్ద శనివారం ఒక సిమెంట్ లారీ అదుపు తప్పి గొర్రెల మందపైకి దూసుకురావడంతో పది గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. బైపాస్ మార్గంలో లారీ వేగంగా వస్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


