News October 25, 2025
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను పకడ్బందీగా చేపట్టాలి: సుదర్శన్ రెడ్డి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ములుగు నుంచి కలెక్టర్ దివాకర, ఆర్డీవో వెంకటేష్, అధికారులు పాల్గొన్నారు. 2002 తర్వాత ఓటరు జాబితాలో నమోదైన వారి వివరాలను మరోసారి ధ్రువీకరించుకోవాలని సూచించారు. బూత్ స్థాయి అధికారుల సహకారం తీసుకొని ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు.
Similar News
News October 28, 2025
పాత భవనాల నుంచి వెంటనే తరలించండి: కలెక్టర్

తుఫాను పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సోమవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడతో కలిసి ఆమె సమీక్షించారు. ప్రమాదకర స్థితిలో ఉన్న పాత భవనాలలో నివసించే ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 28, 2025
ఒకడు ఇళ్ల తలుపులు.. మరొకడు బీరువా విరగ్గొట్టడంతో దిట్ట!

శ్రీకాకుళం జిల్లాలో రాత్రి పూట దొంగతనాలు చేస్తున్న ముఠాను <<18122311>>పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే<<>>. వీరు కాకినాడకు చెందిన వారు. వేంకటేశ్వర్లు, ప్రసాద్ పదేళ్లుగా దొంగతనాలు చేస్తున్నారు. ఒకరు తాళాలు వేసిన ఇళ్ల తలుపులు విరగ్గొట్టడంలో ఎక్స్‌పర్ట్ అయితే మరొకడు బీరువా తలుపులు తెరవడంలో దిట్ట. వీరికి కాకినాడ సెంట్రల్ జైలులో క్రిమినల్ మోహనరావు పరిచమయ్యాడు. వీరంతా కలిసి జిల్లాపై కన్నేసి వరుస దొంగతనాలు చేశారు.
News October 28, 2025
ఖిలా వరంగల్ తూర్పు కోటలో దారుణం

ఖిలా వరంగల్ తూర్పు కోట ప్రాంతంలో మద్యం మత్తులో స్నేహితుల మధ్య తలెత్తిన ఘర్షణ దారుణానికి దారితీసింది. ఈ ఘటనలో సాయి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతణ్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మిల్స్ కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సాయి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.


