News October 25, 2025

‘ఎస్‌ఐఆర్‌’ పకడ్బందీగా రూపొందించాలి: సీఈఓ సుదర్శన్‌ రెడ్డి

image

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)ను పకడ్బందీగా తయారు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి, అదనపు ఎన్నికల అధికారి లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. శనివారం రిటర్నింగ్‌ అధికారులతో ఎస్‌ఐఆర్‌పై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌లో భాగంగా కేటగిరి ‘ఏ’ను బీఎల్‌ఓ యాప్‌ ద్వారా ధ్రువీకరిస్తామని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు.

Similar News

News October 28, 2025

తుఫాను షెల్టర్లకు 534 మంది: మంత్రి నాదెండ్ల

image

ఏలూరు జిల్లాలో తుఫాను సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జిల్లాలోని 27 సహాయక కేంద్రాలకు 534 మంది ప్రజలను తరలించామని ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మొంథా తుఫానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి ఆయన మాట్లాడారు. 408 గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది వాస్తవ పరిస్థితులు తెలియజేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

News October 28, 2025

కొత్తపాలెం గ్రామంలో ఇరువర్గాలు ఘర్షణ.. కేసు నమోదు

image

పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో ఇరువర్గాలు ఘర్షణలకు పాల్పడగా పలువురికి గాయాలైనట్లు చందోలు ఎస్సై శివకుమార్ చెప్పారు. సోమవారం జరిగిన ఘర్షణలో గాయాలైన బాధితులను బాపట్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న బాధితులను పరిశీలించి ఘర్షణకు గల కారణాలను ఎస్ఐ శివకుమార్ అడిగి తెలుసుకున్నారు. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు

News October 28, 2025

పాత భవనాల నుంచి వెంటనే తరలించండి: కలెక్టర్

image

తుఫాను పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సోమవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడతో కలిసి ఆమె సమీక్షించారు. ప్రమాదకర స్థితిలో ఉన్న పాత భవనాలలో నివసించే ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.