News October 25, 2025

GWL: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్‌లో పొరపాటు ఉండొద్దు

image

స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్‌లో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వవద్దని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2002 ఎలక్టోరల్ జాబితాలో నియోజకవర్గాల వారిగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించడం జరిగిందన్నారు. వీసీలో కలెక్టర్ సంతోష్, ఆర్డీఓ అలివేలు, తహశీల్దార్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 28, 2025

జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకు రికార్డు ధర!

image

వర్జీనియా పొగాకు రికార్డు ధర పలికింది. నిన్న వేలంలో కేజీ రూ.454 పలికి చరిత్ర సృష్టించింది. ఉమ్మడి గోదావరి జిల్లాలోని ఐదు పోగాకు కేంద్రాల్లో వేలం జరగ్గా.. గోపాలపురంలో రూ.454 ధర పలికింది. ఇటీవల పలికిన అత్యధిక ధర రూ.430, రూ.420, రూ.415. కాగా ఈ ఏడాది మొదట్లో కేజీ రూ.290 మాత్రమే పలకడంతో రైతులు నిరాశ చెందారు. తర్వాత క్రమంగా పెరుగుతూ ఎక్కువ కాలం రూ.350 వద్ద నమోదు అవుతూ వచ్చింది.

News October 28, 2025

అమరావతిలో రైల్వే కోచింగ్ టెర్మినల్ ప్రణాళిక

image

అమరావతి రాజధాని, గుంటూరు నగరాల్లో రైల్వే కోచింగ్ టెర్మినల్స్‌ ఏర్పాటు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే చర్యలు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక రైళ్ల సంఖ్య గణనీయంగా పెరుగనుంది. సోమవారం CM చంద్రబాబు, రైల్వే GM సంజయ్ శ్రీవాస్తవతో సమావేశమై అమరావతిలో నిర్మించబోయే రైల్వేస్టేషన్‌ను ఆధునికంగా తీర్చిదిద్దాలని సూచించారు. నడికుడి-శ్రీకాళహస్తి, గుంటూరు-గుంతకల్లు మార్గాల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

News October 28, 2025

అందుబాటులోకి ఎలాన్ మస్క్ ‘గ్రోకీపీడియా’

image

వికీపీడియాకి ప్రత్యామ్నాయంగా ‘X’ అధినేత ఎలాన్ మస్క్ ‘గ్రోకీపీడియా’ను తీసుకొచ్చారు. ‘ప్రస్తుతం 0.1 వెర్షన్ అందుబాటులో ఉంది. 1.0 వెర్షన్ దీనికి పదింతలు వేగంగా ఉంటుంది. ఈ 0.1 వెర్షన్ వికీపీడియాకంటే ఎంతో బెటర్‌గా ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. మీరు ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా దీనిలో సమాచారం దొరుకుతుందని చెబుతున్నారు. దీనిని ట్రై చేసిన కొందరు యూజర్లు ఎక్స్‌పీరియన్స్ బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.