News October 25, 2025

దశల వారీగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తి చేస్తాం: కలెక్టర్

image

దశల వారీగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తి చేస్తామని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి, అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్డీవోలు పాల్గొన్నారు.

Similar News

News October 28, 2025

కరీంనగర్: ఉరివేసుకొని రాజస్థాన్‌ కూలి మృతి

image

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేటలో ఓ కూలి ఉరివేసుకుని మృతి చెందాడు. సీఐ కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కి చెందిన బూర రామ్ గ్రామంలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కిరాయికి ఉంటున్న ఇంట్లోని ఇనుప పైపుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

News October 28, 2025

వాట్సాప్‌లో ‘కవర్ ఫొటో’ ఫీచర్!

image

వాట్సాప్ యూజర్లకు త్వరలో ‘కవర్ ఫొటో’ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఫేస్‌బుక్, X తరహాలో ఇందులోనూ ప్రొఫైల్ పిక్ బ్యాక్ గ్రౌండ్‌లో కవర్ ఫొటోను యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం బిజినెస్ అకౌంట్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను సాధారణ వినియోగదారుల కోసం డెవలప్ చేస్తున్నారు. ప్రొఫైల్ పిక్‌ సెట్టింగ్స్ తరహాలోనే కవర్ ఫొటోను ఎవరెవరు చూడాలనేది కూడా యూజర్లు డిసైడ్ చేసుకోవచ్చు.

News October 28, 2025

HYD: రాత్రి భారీ వర్షం.. పలుచోట్ల చిరుజల్లులు

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్, నాచారం, తార్నాక, హబ్సిగూడ, శివంరోడ్ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. శివారు పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం, కందుకూరు తదితర ప్రాంతాల్లో రాత్రి 1 నుంచి ఉ.3వరకు భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లగా మారింది. రోడ్లపై నీరు నిలిచింది. ఆఫీసు సమయాల్లో ట్రాఫిక్ నెమ్మదించింది. ఈరోజు సాయంత్రం గ్రేటర్ వ్యాప్తంగా వర్షం కురిస్తుందని అధికారులు అంచనా వేశారు.