News October 25, 2025

చిత్తూరు: మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు.!

image

రానున్న మూడు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెరువులు, కుంటల పరిస్థితిని ఇరిగేషన్ అధికారులు పరిశీలించాలని ఆయన ఆదేశించారు.

Similar News

News October 26, 2025

నేడు పని చేయనున్న విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు

image

జిల్లాలోని విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు ఆదివారం కూడా పనిచేస్తాయని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. సెలవు రోజు అయినప్పటికీ వినియోగదారుల సౌకర్యం కోసం విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు తెరిచి ఉంటాయని ఆయన వెల్లడించారు. దీనిని సద్వినియోగం చేసుకొని విద్యుత్ బిల్లులు చెల్లించాలని కోరారు.

News October 26, 2025

చిత్తూరు: సహాయక చర్యలకు రూ. 2 కోట్ల కేటాయింపు

image

భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున కేటాయించింది. ఈ నిధుల్ని వరద ప్రాంతాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, ఆహారంతో పాటు మంచి నీళ్లు అందించేందుకు, మెడికల్ క్యాంపుల ఏర్పాటు చేసేందుకు. రోడ్లతో పాటు అవసరమైన వసతుల పునరుద్ధరించేందుకు ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు.

News October 26, 2025

చిత్తూరు: నేడు సర్టిఫికెట్ల పరిశీలన

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని భవితా కేంద్రాలలో పనిచేస్తున్న సహిత విద్య రిసోర్స్ పర్సన్‌ల సర్టిఫికెట్లు పరిశీలించనున్నట్లు డీఈఓ వరలక్ష్మి తెలిపారు. వారికి రెగ్యులర్ పే స్కేల్ అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సర్టిఫికెట్లను ఆదివారం పరిశీలించనున్నట్లు తెలిపారు. పరిశీలనకు తప్పక హాజరు కావాలన్నారు.