News October 25, 2025
ALP: విశేష దినాల్లో కార్తీక దీపోత్సవం..!

కార్తీక మాసం పురస్కరించుకొని అలంపూర్ ఆలయాల్లో ప్రతి సోమవారం, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య విశేష దినాల్లో సాయంత్రం 6 :00 సామూహిక కార్తీకదీపం నిర్వహిస్తున్నట్లు ఈవో దీప్తి శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు దేవస్థానం తరపున ఉచితంగా ప్రమిదలు, వత్తులు, నూనె ఇస్తామన్నారు. దీపోత్సవం అనంతరం మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, తమలపాకులు, నిమ్మకాయలు ప్రసాదంగా ఇస్తామని తెలిపారు.
Similar News
News October 28, 2025
హుజూరాబాద్: జమ్మికుంట రహదారిపై కొండచిలువ

హుజూరాబాద్ పట్టణంలోని జమ్మికుంట రహదారి వద్ద సోమవారం రాత్రి కొండచిలువ కనబడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రోడ్డు మధ్యలో ఒక్కసారిగా కొండచిలువ కన్పించడంతో జనం గుమిగూడరు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుజూరాబాద్‌కు చెందిన పాములు పట్టే అఫ్జల్ ఖాన్‌ను పిలిపించారు. అతడు దానిని పట్టి క్షేమంగా దూరంగా గుట్టల్లో వదిలేయడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు.
News October 28, 2025
చల్వాయి, గోవిందరావుపేట వైన్ షాపులకు రీ నోటిఫికేషన్

చల్వాయి, గోవిందరావుపేట వైన్ షాపులకు తక్కువ అప్లికేషన్స్ రావడంతో డ్రాను వాయిదా వేసిన ఎక్సైజ్ శాఖ రీ నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 1వ తేదీలోగా అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీగా పేర్కొంది. 3న డ్రా నిర్వహిస్తారు. ఈ షాపులను ఎస్టీలకు రిజర్వ్ చేయగా చల్వాయి షాపునకు 2, గోవిందరావుపేటకు 3 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో అధికారులు రీ నోటిఫికేషన్ ఇచ్చారు. నిన్న భంగపడ్డ వారికి ఇదో మంచి అవకాశం.
News October 28, 2025
కాకినాడ పోర్టుకు 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

మొంథా తుఫాను ప్రభావంతో కాకినాడ పోర్ట్‌లో 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను తగ్గించారు. గాలులకు తెగిపడే అవకాశం ఉన్నందున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తొలగించారు. విద్యాసంస్థలకు ఐదు రోజులు సెలవులు ప్రకటించారు. జిల్లాలో 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు తరలిరావాలని అధికారులు సూచిస్తున్నారు.


