News October 25, 2025

విద్యార్థులు ఇష్టమైన వృత్తినే ఎంచుకోవాలి: బాలలత

image

విద్యార్థులు వారికి ఇష్టమైన వృత్తినే ఎంచుకోవాలని రక్షణ మంత్రిత్వ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేసిన బాలలత సూచించారు. వరంగల్ నిట్‌లో జరుగుతున్న టెక్నోజియాన్ రెండో రోజు ఆమె చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని విద్యార్థులకు సూచిస్తూ, విజయవంతమైన వ్యక్తులు తమ సమయాన్ని ఆలోచన, సృష్టికి వినియోగిస్తారని పేర్కొన్నారు.

Similar News

News October 26, 2025

మోంతా ఎఫెక్ట్: అనంతపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మోంతా తుఫాను దూసుకొస్తోంది. దీంతో అనంతపురం జిల్లా అధికారులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అత్యవసర వేళ 85002 92992 నంబరుకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. తుఫాను పర్యవేక్షణ కోసం జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి వడరేవు వినయ్ చంద్‌ను ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది.

News October 26, 2025

రైతులను అప్రమత్తం చేయండి: కలెక్టర్

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వరి పంటకు నష్టం జరగకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం సూచించారు. వరి పంటకు నష్టం వాటిల్లే అవకాశముందని, వ్యవసాయ శాఖ అధికారులు రైతులను అప్రమత్తం చేయాలన్నారు. గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని, వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మానిటరింగ్ చేయాలని ఆదేశించారు.

News October 26, 2025

అనకాపల్లి జిల్లాలో మూడు రోజులు సెలవు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా అనకాపల్లి జిల్లాలో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు ఈనెల 27 నుంచి 29 వరకు సెలవు ప్రకటించారు. కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆదేశాల మేరకు డీఈఓ అప్పారావు నాయుడు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలు తెరవకూడదన్నారు. ఏదైనా పాఠశాల తెరిచినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు.