News October 25, 2025
జిల్లాలో పాఠశాలలకు 3 రోజులు సెలవులు: కలెక్టర్

మొంథా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఈనెల 27 నుంచి 29 వరకు 3 రోజులు సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం ప్రకటించారు. ఉపాధ్యాయులు మాత్రం స్కూళ్లకు హాజరు కావాలన్నారు. శిథిలావస్థలో ఉన్న వసతి గృహాలలోని విద్యార్థులను ఇళ్లకు పంపించాలన్నారు. సమాచారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు తెలియజేయాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News October 26, 2025
నేడు HYDలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

HYDలో ఆకాశం మేఘావృతమై ఉంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ‘నేడు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉదయం పొగమంచు పరిస్థితులు కనిపించొచ్చు. గరిష్ఠ ఉష్ణోగ్రత 29°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 22°Cగా నమోదయ్యే అవకాశం ఉంది’ అని పేర్కొంది.
News October 26, 2025
GNT: రైతుల గుండెల్లో తుఫాన్ గుబులు..!

తుపాను హెచ్చరికలతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే అధిక వర్షాలతో డెల్టాలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు తుపాను ప్రభావంతో ఈదురు గాలులు, అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతల గుండెల్లో గుబులు మొదలైంది. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం వరి పైరు ఏపుగా పెరుగుతోంది. ఈ సమయంలో తుఫాను వస్తే పంట నీట మునిగి ఎందుకూ పనికి రాదని రైతులు భయపడుతున్నారు.
News October 26, 2025
పాలమూరు వర్శిటీలో స్పాట్ అడ్మిషన్స్.. నేడే లాస్ట్

PUలోని బీ.ఫార్మసీలో మిగిలి ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ రమేష్ బాబు ‘Way2News’తో తెలిపారు. నేడు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలని, ఈనెల 28న పబ్లికేషన్ ఫారం ఫార్మసీ కళాశాల కార్యాలయంలో ఇచ్చి కన్ఫామ్ చేసుకోవాలన్నారు. వివరాలకు www.palamuruunivetsity.ac.in వెబ్ సైట్‌లో సందర్శించాలన్నారు. TGEAPCET క్వాలిఫై అయిన అభ్యర్థులు రూ.1300, కానీ అభ్యర్థులు రూ.2100 చెల్లించాలన్నారు.


