News October 25, 2025

జూబ్లీలో ఈసీ రూల్స్ ఫాలో కావాలి: సంజీవ్ కుమార్ లాల్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను తప్పక పాటించాలని వ్యయ పరిశీలకుడు సంజీవ్ కుమార్ లాల్ అన్నారు. శనివారం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారానికి చేసే ప్రతి పైసాను ఎన్నికల సంఘంకు తెలపాలన్నారు. ఖర్చులకు సంబంధించి పక్కగా డాక్యుమెంటేషన్ చేసుకోవాలని సంజీవ్ కుమార్ లాల్ స్పష్టం చేశారు.

Similar News

News October 28, 2025

HYD: మావోయిస్ట్ పార్టీ కీలక సభ్యుడు ప్రకాశ్ లోంగుబాటు

image

మావోయిస్ట్ పార్టీలో తెలంగాణ నుంచి కీలక వ్యక్తి బండి ప్రకాశ్ లొంగిపోయారు. ఆ పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా గతంలో ఆయన పనిచేశారు. మావోయిస్ట్ పార్టీలో నేషనల్ పార్క్ ఏరియాలో ఈయన కీలక ఆర్గనైజర్‌గా తెలుస్తోంది. 45 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసిన రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ @ ప్రభాత్ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు.

News October 28, 2025

రంగారెడ్డి: FREE కోచింగ్.. రేపే లాస్ట్

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ మహిళలకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ చిలుకూరు డైరెక్టర్ ఎండీ. అలీఖాన్ Way2Newsతో తెలిపారు. బ్యూటీ పార్లర్ కోర్సులలో ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. 19- 45 లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, ఆధార్‌కార్డ్, కాస్ట్ సర్టిఫికెట్, 4 ఫొటోలతో ఈనెల 29లోగా దరఖాస్తులు చేసుకోవాలని వివరాలకు 85001 65190లో సంప్రదించాలన్నారు. SHARE IT.

News October 28, 2025

జూబ్లీ బైపోల్: ప్రచారానికి రేవంత్.. మరి KCR?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను టీపీసీసీ ఖరారు చేసింది. అక్టోబరు 31 నుంచి ప్రచారం చేయనున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఇదిలా ఉండగా BRS అధినేత కేసీఆర్ ప్రచారంచేసే తేదీలు ఖరారు కాలేదు. తమ బాస్ ప్రచారం చేస్తే సునీత గెలుస్తారని కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే కేసీఆర్ ప్రచారంపై పార్టీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.