News October 25, 2025
GWL: 34 మద్యం దుకాణాలకు 774 దరఖాస్తులు..!

గద్వాల జిల్లాలో 2025- 27 సంవత్సరానికి గాను 34 మద్యం దుకాణాలకు 774 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ సీఐ గణపతి రెడ్డి శనివారం తెలిపారు. దరఖాస్తుల నుంచి లాటరీ పద్ధతి ద్వారా ఈనెల 27న కలెక్టరేట్‌లోని ఐడీఓసీ మందిరంలో ఉదయం 11:00 మద్యం దుకాణాల ఎంపిక జరుగుతుందన్నారు. మద్యం దుకాణాలకు టెండర్ వేసిన వారు ఉదయం 9:00 గంటలకు చేరుకోవాలని సూచించారు. కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక జరుగుతుందన్నారు.
Similar News
News October 26, 2025
వరంగల్ : అక్కడ సై.. ఇక్కడ నై..!

ఉమ్మడి WGL జిల్లా కాంగ్రెస్ నేతల్లో నెలకొన్న మంత్రి కొండా సురేఖ-MLAల విభేదాలు పార్టీ కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విభేదాల కారణంగా ద్వితీయ శ్రేణి నేతలకు పదవులు రాకుండా అడ్డంకులు ఏర్పడుతున్నాయని భావన నెలకొంది. ఈ ఏడాది జనవరి 27న ప్రకటించిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి విభేదాల కారణంగా ప్రమాణ స్వీకారం జరగకముందే రద్దయింది. ఇప్పటికైనా మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసేలా చూడాలంటున్నారు.
News October 26, 2025
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

AP: ఇంటర్ విద్యార్థులు తమ పేరు, గ్రూప్, మీడియం తదితర వివరాలను చెక్ చేసుకునేందుకు ఇంటర్ విద్యా మండలి అవకాశం కల్పించింది. <
News October 26, 2025
ఎర పంటల వల్ల వ్యవసాయంలో లాభమేంటి?

కొన్ని రకాల పంటలు కొన్ని పురుగులను విపరీతంగా ఆకర్షిస్తాయి. ఆ పంటలను ప్రధాన పొలంలో వేస్తే పురుగు రాకను, ఉనికిని వెంటనే గుర్తించవచ్చు. అటువంటి పంటలను ఎరపంటలు లేదా ఆకర్షక పంటలు అంటారు. ఎరపంటలు వేయడం వల్ల ప్రధాన పంటపై పురుగుల ఉద్ధృతి తగ్గుతుంది. అలాగే పురుగుమందులు వాడాల్సిన అవసరం, వాటి కొనుగోలుకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. రైతులు ఈ ఎర పంటల ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రధాన పంటలో వేసుకోవాలి.


