News October 25, 2025
NGKL: 27న లక్కీడీప్ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు

జిల్లాలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 27న లక్కీ డీప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 67 దుకాణాలకు గాను 1,518 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి హాలులో ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ సమక్షంలో లక్కీ డీప్ నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
Similar News
News October 28, 2025
కృష్ణా: చేనేత కార్మికుల జీవితాలు చీకట్లోకి.!

ఏడాదిగా చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో మగ్గాల లోపల నీరు చేరి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా చేనేత కార్మికులు పనిలేక అర్ధకలితో రోజులు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సొసైటీలు కూడా కార్యకలాపాలు కొనసాగించలేని స్థితిలోకి వెళ్లిపోయాయి. ప్రభుత్వం త్రిఫ్ట్ ఫండ్, యార్న్ సబ్సిడీ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల జీవనోపాధి దెబ్బతింటోందని పేర్కొన్నారు.
News October 28, 2025
BNGR: విద్యుత్ షాక్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

ఆత్మకూరు (ఎం) మండలం లింగరాజుపల్లిలో విద్యుత్ షాక్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గణేష్ (26) మృతిచెందాడు. ఇంటి నిర్మాణంలో భాగంగా ఇనుప రాడ్లను తొలగిస్తుండగా, రాడ్ విద్యుత్ తీగపై పడింది. ఆ రాడ్‌ను పట్టుకున్న గణేష్ విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక్కగానొక్క కొడుకు మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
News October 28, 2025
సిద్దిపేటలో యాదాద్రి వాసికి జాక్‌పాట్

తెలంగాణ రాష్ట్రంలో మద్యం టెండర్ల లక్కీ డ్రాలో భువనగిరి జిల్లా చల్లూరుకి చెందిన భీమగాని బాలనరసయ్య అదృష్టం వరించింది. సిద్దిపేట జిల్లా పరిధిలో ఏకంగా ఆరు మద్యం దుకాణాలను ఆయన దక్కించుకున్నారు. రాయపోల్, అంబర్‌పేట్, చిన్నకోడూరు, పుదూర్, మజీద్‌పూర్‌లోని వైన్స్ షాపులు కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట లక్కీ డ్రా ద్వారా వచ్చాయని నరసయ్య తెలిపారు.


