News October 25, 2025

మంత్రి పొన్నం రాజీనామా చేయాలని AAP డిమాండ్

image

హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరగడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని AAP తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డా.దిడ్డి సుధాకర్ ఆరోపించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శనివారం లిబర్టీలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మృతులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.

Similar News

News October 28, 2025

BNGR: విద్యుత్ షాక్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

image

ఆత్మకూరు (ఎం) మండలం లింగరాజుపల్లిలో విద్యుత్ షాక్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గణేష్ (26) మృతిచెందాడు. ఇంటి నిర్మాణంలో భాగంగా ఇనుప రాడ్లను తొలగిస్తుండగా, రాడ్ విద్యుత్ తీగపై పడింది. ఆ రాడ్‌ను పట్టుకున్న గణేష్ విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక్కగానొక్క కొడుకు మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

News October 28, 2025

సిద్దిపేటలో యాదాద్రి వాసికి జాక్‌పాట్

image

తెలంగాణ రాష్ట్రంలో మద్యం టెండర్ల లక్కీ డ్రాలో భువనగిరి జిల్లా చల్లూరుకి చెందిన భీమగాని బాలనరసయ్య అదృష్టం వరించింది. సిద్దిపేట జిల్లా పరిధిలో ఏకంగా ఆరు మద్యం దుకాణాలను ఆయన దక్కించుకున్నారు. రాయపోల్, అంబర్‌పేట్, చిన్నకోడూరు, పుదూర్, మజీద్‌పూర్‌లోని వైన్స్ షాపులు కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట లక్కీ డ్రా ద్వారా వచ్చాయని నరసయ్య తెలిపారు.

News October 28, 2025

ముప్పై తర్వాత మహిళలు ఇలా చేయండి

image

సాధారణంగా వర్కింగ్ ఉమెన్‌కు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అటు ఇంటిని-ఇటు ఉద్యోగాన్నీ బ్యాలెన్స్‌ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా 30ఏళ్లు దాటిన తర్వాత దీనికి తగ్గట్లు జీవనశైలిని మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు.