News October 25, 2025
కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్‌పై BRS ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హీటెక్కింది. బీఆర్ఎస్ నాయకులపై సోషల్ మీడియాలో కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ దుష్ప్రచారం చేసిందని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఫేక్ పోస్టులు, తప్పుదారి పట్టించే వీడియోలు, ఎడిట్ చేసిన ఫొటోలతో తమ మీద బురద జల్లుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటువంటి ఫేక్ పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News October 28, 2025
గుంటూరు జిల్లా ప్రయాణికులకు ముఖ్య గమనిక

గుంటూరు మీదు నవంబర్‌లో పలు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్-అనకాపల్లి రైలు (07055) నవంబర్ 6 నుంచి 27 వరకు ప్రతి గురువారం, తిరుగు రైలు (07056) నవంబర్ 7 నుంచి 28 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. కాకినాడ-మైసూరు రైళ్లు (07033, 07034) నవంబర్ 3 నుంచి 29 వరకు నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా ప్రయాణిస్తాయి. అదనంగా నవంబర్ 13, 14 తేదీల్లో యలంక-అనకాపల్లి రైళ్లు కూడా నడవనున్నాయి.
News October 28, 2025
HYD: పోస్ట్ ఆఫీసుల్లో రాత్రి 9 వరకు ఆధార్ సేవలు

HYDలోని జనరల్ పోస్ట్ ఆఫీసుల్లో ఆధార్ సేవా కేంద్రాలు ఉ.8 నుంచి రాత్రి 9 గం. వరకు పనిచేస్తున్నట్లు చీఫ్ పోస్ట్ మాస్టర్ వై.ప్రసాద్ తెలిపారు. ఆధార్ అనుసంధానం ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారిందన్నారు. పేరు, ఇంటి పేరు, చిరునామా, మొబైల్ నంబర్ సవరణల కోసం ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆలస్యం చేయకుండా దగ్గర్లోని పోస్ట్ ఆఫీసులో సంప్రదించండి. SHARE IT
News October 28, 2025
ప్రతిరోజూ మహిళల కోసం స్పెషల్ కంటెంట్

Way2Newsలో మహిళల కోసం ప్రత్యేకంగా ‘వసుధ’ కేటగిరీని ప్రవేశపెట్టాం. ఇందులో ప్రతి రోజూ ఉమెన్ హెల్త్, ప్రెగ్నెన్సీ, బ్యూటీ, హెయిర్ కేర్ టిప్స్, వంటింటి చిట్కాలు, ఫ్యాషన్, స్ఫూర్తిదాయక కథనాలు, చైల్డ్ కేర్, పేరెంటింగ్‌పై ఆర్టికల్స్ అందుబాటులో ఉన్నాయి.
* స్క్రీన్‌పై క్లిక్ చేసి కింది భాగంలో కేటగిరీలు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లవచ్చు. కేటగిరీలు కన్పించలేదంటే యాప్ అప్డేట్ చేసుకోండి.


