News October 25, 2025

సంగారెడ్డి: ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను పకడ్బందీగా పూర్తి చేయాలి’

image

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ఇప్పటికే బీఎల్‌ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించామని, రివిజన్‌ను పకడ్బందీగా పూర్తి చేస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు.

Similar News

News October 26, 2025

కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న నగరం

image

బొల్లారం, బాచుపల్లి, మియాపూర్, అమీన్‌పూర్ పారిశ్రామికవాడలోని ఆయిల్, కెమికల్ కంపెనీల కారణంగా ఈ ప్రాంతాల్లో గాలి విషపూరితంగా మారుతోందని ప్రజలు వాపోతున్నారు. వీటినుంచి విడుదలవుతున్న వాయువులను పీల్చలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సంబంధిత అధికారులు మౌనం వ్రతం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

News October 26, 2025

చనిపోయిన స్నేహితుడిపై ఎర్రిస్వామి ఫిర్యాదు

image

బైక్ ప్రమాదంలో చనిపోయిన శివశంకర్‌పై అతడి స్నేహితుడు ఎర్రిస్వామి కర్నూలు (D) ఉలిందకొండ PSలో ఫిర్యాదు చేశాడు. ‘నేను, శివశంకర్ మద్యం సేవించాం. అతడి నిర్లక్ష్యం వల్లే ఇద్దరం కిందపడిపోయాం. శివ స్పాట్‌లో చనిపోయాడు. డెడ్ బాడీని పక్కకు తీసేందుకు ప్రయత్నించాను. మా <<18102090>>బైకును<<>> మరో వాహనం ఢీకొట్టడంతో అది రోడ్డు మధ్యలో పడింది. దీంతో బస్సు బైకును లాక్కెళ్లింది’ అని తెలిపాడు. దీంతో శివపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 26, 2025

బాపట్ల: గమనిక.. రేపు పీజీఆర్ఎస్ రద్దు

image

ప్రతి సోమవారం జిల్లా కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 27 నుంచి 29వ తారీకు వరకు మొంథా తుఫాను ప్రభావం జిల్లాపై ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది కావున ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో ఎవరు సమస్యలకు సంబంధించిన అర్జీలతో జిల్లా కార్యాలయానికి సోమవారం రావద్దని తెలిపారు.