News October 26, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 26, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.59 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.12 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.11 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.48 గంటలకు
✒ ఇష: రాత్రి 7.01 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు

Similar News

News October 28, 2025

ఉదయాన్నే టీ, కాఫీ తాగుతున్నారా?

image

ఉదయం లేవగానే కాఫీ, టీ తాగితేనే కానీ చాలామంది కాలకృత్యాలు పూర్తి చేయలేరు. అయితే ఇదెంతమాత్రం మంచిది కాదంటున్నారు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.సుశీల్ శర్మ. ‘టీ, కాఫీలు ముందు పెద్దపేగును కదిలిస్తాయి. తరువాత అదే అలవాటుగా మారి చివరకు పేగుల సహజ రిథమ్‌ను దెబ్బతీస్తాయి. ఆపై పొట్టలో ఇరిటేట్ చేస్తాయి. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి’ అని పేర్కొన్నారు. వాటి బదులు గోరువెచ్చని నీటిని సేవించాలని సూచించారు.

News October 28, 2025

అడుగున ఎరువుకొద్దీ పైన బంగారం

image

ఏ పొలానికైనా ఎరువులే బలం అని చెప్పేందుకు ఈ సామెతను ఉపయోగిస్తారు. పొలం పనులలో భూమికి ఎరువు వేయడం కష్టమైనా, సరైన ఎరువు ఫలితంగా బంగారంలాంటి పంట పండి మనకు సంతోషం కలుగుతుంది. అలాగే, కష్టపడి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ఈ సామెత చెబుతుంది.

News October 28, 2025

ఈ 12 జిల్లాల్లో నేటి నుంచే రేషన్ పంపిణీ

image

AP: తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఇవాళ్టి నుంచే రేషన్ పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ప.గో, కృష్ణా, బాపట్ల, కాకినాడ, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లోని రేషన్ లబ్ధిదారులకు సరుకులు అందజేయనున్నారు. అటు ఈ 12 జిల్లాల్లో రాబోయే 3 రోజులపాటు పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా కంపెనీలతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.