News October 26, 2025
ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు శంభాజీనగర్ స్టేషన్‌గా మార్పు

MHలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి శంభాజీనగర్ స్టేషన్‌గా మార్చినట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. మూడేళ్ల క్రితం ఔరంగాబాద్ సిటీ పేరునూ ఛత్రపతి శంభాజీనగర్‌గా మార్చిన సంగతి తెలిసిందే. పేర్ల మార్పును కొందరు సమర్థిస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. పేర్లు మారిస్తే రైళ్లలో అందరికీ సీట్లు దొరుకుతాయా? ప్లాట్‌ఫామ్స్ క్లీన్‌గా ఉంటాయా? టికెట్లు వేగంగా బుక్ అవుతాయా అని ప్రశ్నిస్తున్నారు.
Similar News
News October 28, 2025
హెయిర్ డై వాడే ముందు ఇవి తెలుసుకోండి

జుట్టుకు రంగువేసుకోవడం వల్ల హార్మోన్ల అసమతౌల్యత, క్యాన్సర్ రావొచ్చని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. తప్పనిసరైతే తప్ప డై వాడకూడదంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే అమోనియా, PPD, హైడ్రోజన్ పెరాక్సైడ్ తలలోని నేచురల్ ఆయిల్స్‌ని పొడిబారేలా చేస్తాయి. దీంతో జుట్టు రాలడం, పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉంటే దురద, అలెర్జీ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయంటున్నారు.
News October 28, 2025
బరితెగించారు.. పోర్న్ సైట్లలో చిరంజీవి డీప్ ఫేక్ వీడియో

మెగాస్టార్ చిరంజీవి విషయంలో సైబర్ నేరగాళ్లు బరితెగించారు. ఆయన డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి ఏకంగా పోర్న్ సైట్లలో పెట్టారు. ఆయన ఓ మహిళతో ఇంటిమేట్ సీన్లలో పాల్గొన్నట్లు AI వీడియోలు క్రియేట్ చేసి ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో నిందితులను అరెస్ట్ చేయాలంటూ చిరంజీవి CP సజ్జనార్‌ను కోరారు. ఇది తన గౌరవానికి భంగం కలిగించిందని ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News October 28, 2025
రాష్ట్రంలో మెగా జాబ్ మేళా

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తుళ్లూరులోని CRDA ఆఫీస్, స్కిల్ హబ్ వద్ద రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10 మల్టీ నేషనల్ కంపెనీలు 400 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. నిరుద్యోగ అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెజ్యూమ్, సర్టిఫికెట్లు తీసుకుని ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.


