News April 9, 2024
HYD: కాంగ్రెస్‌లోకి అంబర్‌పేట MLA.. క్లారిటీ
తాను కాంగ్రెస్ పార్టీలో చేరతానని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అంబర్‌పేట MLA కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇదంతా హస్తం పార్టీ మైండ్ గేమ్ అని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. 2 పర్యాయాలు తనను ఎమ్మెల్యేగా గెలిపించింది కారు గుర్తు అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చలువతోనే తాను ఎమ్మెల్యే అయ్యాయని కాలేరు వెల్లడించారు.
Similar News
News December 31, 2024
HYD: బీఈ పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగింపు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని బీఈ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఈ(ఏఐసీటీఈ), బీఈ (సీబీసీఎస్), బీఈ(నాన్ సీబీసీఎస్) కోర్సుల మెయిన్, బ్యాక్ లాగ్, సప్లమెంటరీ పరీక్షా ఫీజును వచ్చే నెల 3వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
News December 30, 2024
న్యూ ఇయర్.. రాచకొండ సీపీ కీలక ప్రకటన
రాచకొండ కమిషనరేట్ పరిధిలో నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో CP సుధీర్ బాబు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. 31 DEC రాత్రి 11 నుంచి జనవరి 1న ఉదయం 5 గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్(ORR)లో లైట్ వాహనాలకు నిషేధం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. డ్రంక్ & డ్రైవింగ్ నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామన్నారు. మద్యం తాగి వాహనం నడిపితే రూ.10వేలు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్షతో పాటు చర్యలు తీసుకుంటామన్నారు.
News December 30, 2024
HYD: మాజీ ఎంపీని పరామర్శించిన మంత్రులు
నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యే వివేక్‌లు సోమవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మందా జగన్నాథంకి మంచి చికిత్స అందించాలని డాక్టర్ల బృందానికి మంత్రులు సూచించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.