News October 26, 2025
SDPT: తగ్గిన మద్యం కిక్కు.. ఎవరికి దక్కేనో లక్కు ?

సిద్దిపేట జిల్లాలో ఈసారి మద్యం దుకాణాలకు దరఖాస్తులు వేయడానికి అంతగా ఆసక్తి చూపలేదు. గతంతోపోలిస్తే సగం దరఖాస్తుల తగ్గాయి. ఈనెల 18 వరకు దరఖాస్తుల స్వీకరణకు ఉన్న గడుపును 23 వరకు పొడిగించినా 93 వైన్ షాపులకు 2,782 దరఖాస్తులే వచ్చాయి. 2023లో 4,166 రాగా ఈసారి 1,384 దరఖాస్తులు తగ్గాయి. టెండర్ దరఖాస్తు ధర రూ.3 లక్షలకు పెరగడంతో వేయడానికి వెనకాడారు. కాగా 27న డ్రా తీయనుండగా లక్కు కోసం ఎదురుచూస్తున్నారు.
Similar News
News October 28, 2025
విదేశాల్లో జాబ్ చేయాలనుకుంటున్నారా?

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జర్మనీలో మెకానిక్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ/డిప్లొమా/బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 10వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://naipunyam.ap.gov.in/
News October 28, 2025
MNCL: మరణించినా… ఆయన కళ్లు సజీవం

తాను మరణించిన అతని కళ్లు మాత్రం మరో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించాయి. మంచిర్యాలలోని జన్మభూమినగర్‌కు చెందిన మోతే రాజమల్లు అనారోగ్యంతో మృతి చెందగా.. సదాశయ ఫౌండేషన్ విజ్ఞప్తి మేరకు కుటుంబ సభ్యులు పెద్ద మనసు చేసుకొని రాజమల్లు నేత్రాలను దానం చేశారు. ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నిషియన్ నేత్రాలను సేకరించి హైదరాబాద్ కు తరలించారు. ఈ సందర్భంగా రాజమల్లు కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు.
News October 28, 2025
నల్గొండ: పిచ్చికుక్క బీభత్సం.. ఏడుగురికి గాయాలు

నల్గొండ నాలుగో వార్డు, కేశరాజుపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఆ పిచ్చికుక్క దాడిలో ఏడుగురు గాయపడ్డారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైందని, రోడ్డుపై వెళ్లే బైకర్లను కూడా వెంటాడి గాయపరుస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, ఆ పిచ్చికుక్కను పట్టుకోవాలని వారు కోరుతున్నారు.


