News October 26, 2025

25 ప్రైవేట్ బస్సులకు భారీగా జరిమానా: RTO

image

కర్నూలు(D) జిల్లా బస్సు దుర్ఘటన నేపథ్యంలో శనివారం రాత్రి తిరుపతి జిల్లా వ్యాప్తంగా RTA అధికారులు తనిఖీలు చేపట్టారు. RTO మురళీమోహన్ నిబంధనలు పాటించని 25 బస్సులపై కేసులు నమోదు చేశారు. అగ్ని మాపక నియంత్రణ పరికరాలు లేనివి 5, సరుకు రవాణా చేస్తున్న వాహనాలు 6, అనధికార సీటింగ్ మార్పిడిపై కేసులు నమోదయ్యాయన్నారు. మొత్తం రూ.3లక్షలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

Similar News

News October 28, 2025

రోజూ ఇలా చేస్తే ప్రశాంతంగా నిద్ర పడుతుంది: వైద్యులు

image

నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు సూచిస్తున్నారు. ‘రోజూ నిద్రపోయే సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. వారాంతాల్లోనూ ఒకే సమయానికి పడుకుని, మేల్కొంటే శరీరం ఒకే దినచర్యకు అలవాటు పడుతుంది. పడుకునే 30-60 నిమిషాల ముందు టీవీలు, ల్యాప్‌టాప్స్‌కు దూరంగా ఉండాలి. దీనికి బదులు పుస్తకాలు చదవండి. గదిని చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి’ అని చెబుతున్నారు.

News October 28, 2025

HYD మహిళాశక్తి క్యాంటీన్ల అవగాహనకు స్పెషల్ టీం

image

నగరంలో మహిళా శక్తి క్యాంటీన్లకు సంబంధించి ఆర్థిక స్వావలంబన, మహిళల స్వాతంత్ర్యానికి నిదర్శనంగా ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో దివ్య దేవరాజన్ ప్రత్యేకంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వాటిని పరిశీలించినట్లు తెలిపారు. వీటిపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నారు.

News October 28, 2025

అందరూ ప్రజలకు అండగా ఉండాలి: చంద్రబాబు

image

‌మొంథా తుపాను నేపథ్యంలో కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో సీఎం చంద్రబాబు మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నేడు, రేపు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.