News October 26, 2025
తుఫాన్: ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

AP: తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో అధికారులు పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
* 27, 28 తేదీలు: తూ.గో, అన్నమయ్య, కడప జిల్లాలు
* 27, 28, 29 తేదీలు: ఎన్టీఆర్, బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాలు
> కోనసీమ జిల్లాలో వర్షాల తీవ్రతను బట్టి సెలవు ప్రకటించాలని కలెక్టర్ ఆదేశించారు. అటు మరిన్ని జిల్లాలకు హాలిడే ఇచ్చే అవకాశం ఉంది.
Similar News
News October 28, 2025
అవసరమైతే కేంద్రం సాయం కోరుతాం: CBN

AP: అందరూ సహాయక చర్యల్లో పాల్గొనాలని CM చంద్రబాబు కూటమి నేతలకు టెలీకాన్ఫరెన్స్‌లో పిలుపునిచ్చారు. ‘రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తుఫాను తీరం దాటుతుంది. కృష్ణా, ప.గో, కోనసీమ, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ప్రాణనష్టం పూర్తిగా తగ్గించడం, ఆస్తినష్టం నివారించేలా చర్యలు చేపట్టాం. పిల్లలు, గర్భిణులు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలి. అవసరమైతే కేంద్రం సాయం కోరుతాం’ అని తెలిపారు.
News October 28, 2025
కళ్ల కింద డార్క్ సర్కిల్స్.. ఇలా మాయం

ఒత్తిడి, హార్మోన్ల ప్రభావం, నిద్రలేమి, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువగా చూడటం వల్ల మహిళల్లో కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. ఈ సమస్యకు ఇంట్లోని పదార్థాలతోనే సహజంగా తగ్గించుకోవచ్చు. పచ్చి పాలు/బంగాళదుంప రసంలో దూదిని ముంచి కళ్ల కింద పెట్టి 20ని. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజుకు 2సార్లు ఇలా చేయాలి. బంగాళదుంప/కీరా ముక్కను కళ్లకింద 10ని. రుద్ది నీటితో కడిగేసుకున్నా ప్రయోజనం ఉంటుంది.
News October 28, 2025
ఇంటర్వ్యూతోనే NIRDPRలో ఉద్యోగాలు..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) 9పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనుంది. వీటిలో సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. బీఈ, బీటెక్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఎర్త్& ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జియో ఇన్ఫర్మాటిక్స్, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 29న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్‌సైట్: http://career.nirdpr.in


