News October 26, 2025

గుంటూరులో నాన్ వెజ్ ధరలు ఇవే..!

image

గుంటూరులో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220, స్కిన్‌తో రూ. 200కి విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.900 వద్ద స్థిరంగా ఉంది. చేపలలో కొరమేను రూ.440, రాగండి రూ.170, బొచ్చ రూ.220గా ఉంది. చేపలను కొనుగోలు చేయడానికి నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

Similar News

News October 28, 2025

గుంటూరు జిల్లాలో ప్రారంభమైన ముంతా తుపాన్ ఎఫెక్ట్

image

గుంటూరు జిల్లాలో మొంథా తుపాన్ ప్రభావం ప్రారంభమైంది. తెనాలి, గుంటూరు, మంగళగిరి, కొల్లిపర మండలాల్లో గాలివానలు ముప్పు రేపుతున్నాయి. భారీ గాలి వేగంతో చెట్లు ఊగిపోతుండగా, కొన్ని చోట్ల గాలితో కూడిన వర్షం పడుతుంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచనలు జారీ అయ్యాయి.

News October 28, 2025

తుపాను ప్రభావం.. జగన్‌ తాడేపల్లి పర్యటన వాయిదా

image

మొంథా తుపాను ప్రభావంతో విమాన సర్వీసులు రద్దు కావడంతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తాడేపల్లి పర్యటనను వాయిదా వేశారు. గన్నవరం విమాన సర్వీసులు పునరుద్ధరించగానే రేపు ఆయన రావచ్చని పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. తుపాను బాధితులు అప్రమత్తంగా ఉండాలని, సహాయ చర్యల్లో పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొనాలని జగన్‌ పిలుపునిచ్చారు.

News October 28, 2025

అందరూ ప్రజలకు అండగా ఉండాలి: చంద్రబాబు

image

‌మొంథా తుపాను నేపథ్యంలో కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో సీఎం చంద్రబాబు మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నేడు, రేపు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.