News October 26, 2025
నిడదవోలు: నకిలీ పోలీసు అరెస్ట్

పోలీసునని చెప్పుకుంటూ చోరీలకు పాల్పడిన వైజాగ్‌కు చెందిన ఆదిరెడ్డి అప్పారావును శనివారం అరెస్ట్ చేసినట్లు సమీస్ర గూడెం ఎస్ఐ బాలాజీ సుందర్ రావు తెలిపారు. శంకరాపురంలో రెండు కేసుల్లో ఇతను నిందితుడన్నారు. నిందితుడి నుంచి రెండు ఉంగరాలు, ఒక బంగారు గొలుసు, బెలోనో కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇతనిపై మొత్తం 14 పాత కేసులు ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు.
Similar News
News October 29, 2025
FLASH: వికారాబాద్ జిల్లాలో కాలేజీలు, స్కూళ్లకు సెలవు

వికారాబాద్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా విద్యాధికారి రేణుకా దేవి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్య విద్యాసంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా బుధవారం సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉత్తర్వులను జారీ చేశారు.
News October 29, 2025
పెరిగిన బంగారం, వెండి ధరలు!

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రా.ల బంగారం ధర రూ.760 పెరిగి రూ.1,21,580కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా.ల పసిడి ధర రూ.700 ఎగబాకి రూ.1,11,450గా ఉంది. అటు కేజీ వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,66,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 29, 2025
చిత్తూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి చిత్తూరు ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోలీసు అధికారుల కథనం మేరకు.. పుంగనూరు మండలంలోని బాలికను 2019 ఏప్రిల్‌లో అత్యాచారం చేసిన కేసులో నేరం నిర్ధారణ కావడంతో కళ్యాణ్ అనే నిందితుడికి జడ్జి శంకర్రావు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించినట్టు తెలిపారు.


