News October 26, 2025
సంగారెడ్డి: యువకుడిపై ఫోక్స్ కేసు నమోదు

కల్హేర్ మండలం రాపర్తి గ్రామానికి చెందిన కస్ప సంతోష్‌పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు కంగ్టి సీఐ వెంకటరెడ్డి శనివారం తెలిపారు. రెండు నెలల క్రితం కల్హేర్‌లో అతని మేన మామ వద్ద ఉంటూ ఓ బాలికను ఎత్తుకెళ్లాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.
Similar News
News October 26, 2025
పుట్టపర్తి సత్యసాయి బాబా సూక్తులు

★ మానవుడు ప్రతి విషయంలోనూ పరిమితిని పాటించాలి. పరిమితి లేకుండా, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తే అనేక పొరపాట్లు జరిగే అవకాశం ఉంది
★ సూర్యునివలే ప్రతి మానవుడు నిరహంకారిగా తయారుకావాలి
★ శ్రమించి పనిచేసే వారికి సర్వసంపదలు చేకూరుతాయి
★ చక్కెరలో నీటిని కలిపినప్పుడు పానకం అవుతుంది, దైవనామ స్మరణతో ప్రేమను కూర్చినప్పుడు అది అమృతం అవుతుంది.
News October 26, 2025
కుక్క కరిచిన నెల తర్వాత చిన్నారి మృతి

TG: నిజామాబాద్(D) బాల్కొండకు చెందిన గడ్డం లక్షణ(10) అనే బాలిక కుక్క కరిచిన నెల తర్వాత మరణించింది. కుక్క గీరడంతో ఆమె తలకు గాయమైంది. ఇంట్లో చెబితే తిడతారనే భయంతో చెప్పలేదు. 3 రోజుల క్రితం కుక్కలా అరుస్తూ వింతగా ప్రవర్తించడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేబిస్ వ్యాధి తీవ్రమై చనిపోయిందని వైద్యులు తెలిపారు. కుక్క కరిచిన వెంటనే రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News October 26, 2025
ASF: ఢిల్లీకి చేరిన జాబితా.. ఎవరి ధీమా వారిదే!

తెలంగాణ రాష్ట్ర డీసీసీల జాబితా ఢిల్లీకి చేరింది. CM రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో డీసీసీల జాబితాను ఢిల్లీ పెద్దలకు అందజేశారు. ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ పదవిపై ఎవరి ధీమా వారికే ఉంది. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ఎవరికి వారే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


