News October 26, 2025
నల్లరంగు వల్ల బైకును గుర్తించలేకపోయా: డ్రైవర్

AP: రోడ్డుపై పడిన <<18102090>>బైక్<<>> నల్లరంగులో ఉండటంతో దూరం నుంచి సరిగా గుర్తించలేకపోయానని వేమూరి కావేరి బస్సు డ్రైవర్ లక్ష్మయ్య పోలీసులకు చెప్పాడు. వర్షంలో సడెన్ బ్రేక్ వేస్తే ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో ఆపకుండా బైకుపై నుంచి బస్సును పోనిచ్చినట్లు తెలిపాడు. కాగా ఈ ప్రమాదానికి ముందు 3 బస్సులు ఆ బైకును గుర్తించి పక్క నుంచి వెళ్లినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లే.
Similar News
News October 26, 2025
కొమురం భీమ్ గురించి తెలుసుకోండి: మోదీ

ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్‌పై PM మోదీ ప్రశంసలు కురిపించారు. ‘బ్రిటిషర్ల దోపిడీ, నిజాం దురాగతాలు పెరిగిపోయిన సమయంలో 20 ఏళ్ల యువకుడు ఎదురు నిలబడ్డాడు. తన పోరాటంలో నిజాం అధికారిని చంపి, అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. నేను మాట్లాడేది కొమురం భీమ్ గురించే. ఈ నెల 22న ఆయన జయంతి జరిగింది. ఎంతోమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన గురించి యువత తెలుసుకోవాలి’ అని మన్‌కీ బాత్‌లో పిలుపునిచ్చారు.
News October 26, 2025
KKR హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్!

IPL: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కొత్త హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి BCCI తొలగించాక అభిషేక్ KKR సపోర్ట్ స్టాఫ్‌గా జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయన హెడ్ కోచ్‌గా ప్రమోట్ అవుతున్నారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొంది. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలిపింది. WPLలో UP వారియర్స్‌కు నాయర్ హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే.
News October 26, 2025
కుక్క కరిచిన నెల తర్వాత చిన్నారి మృతి

TG: నిజామాబాద్(D) బాల్కొండకు చెందిన గడ్డం లక్షణ(10) అనే బాలిక కుక్క కరిచిన నెల తర్వాత మరణించింది. కుక్క గీరడంతో ఆమె తలకు గాయమైంది. ఇంట్లో చెబితే తిడతారనే భయంతో చెప్పలేదు. 3 రోజుల క్రితం కుక్కలా అరుస్తూ వింతగా ప్రవర్తించడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేబిస్ వ్యాధి తీవ్రమై చనిపోయిందని వైద్యులు తెలిపారు. కుక్క కరిచిన వెంటనే రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.


