News October 26, 2025
సిరిసిల్ల: పాము కాటుతో 18 నెలల చిన్నారి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లికి చెందిన ఏడాదిన్నర చిన్నారి చేకుట వేదాన్షి శనివారం రాత్రి పాము కాటుతో మృతి చెందింది. ఆశిరెడ్డిపల్లికి చెందిన రమేష్-సుమలతల కూతురు వేదాన్షి ఇంటిముందు ఆడుకుంటుండగా పాము కాటుకు గురైంది. చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలపడంతో బాధిత తల్లిదండ్రులు బోరున విలపించారు. వేదాన్షి మృతితో ఆశిరెడ్డిపల్లిలో విషాదం అలుముకుంది.
Similar News
News October 28, 2025
గుర్ల కేజీబీవీలో షార్ట్ సర్క్యూట్.. ఐదుగురికి అస్వస్థత

గుర్ల KGBVలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో డార్మిటరీలో పరుపులు తగలబడి పొగ వ్యాపించింది. మంటలు చెలరేగడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలు చెందారు. అర చేతిలో ప్రాణాలు పెట్టుకుని అంతా బయటకి వచ్చారు. ఈ ఘటనలో పొగ పీల్చిన ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నెల్లిమర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే చికిత్స అందడంతో ఆరోగ్యం మెరుగుపడిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు.
News October 28, 2025
ఉప్పునుంతలలో 26.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలోనే అత్యధికంగా ఉప్పునుంతల మండలంలో 26.0 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అచ్చంపేటలో 25.8, లింగాల 20.3, అమ్రాబాద్ 16.5, తెలకపల్లి 16.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.
News October 28, 2025
చిత్తూరు జిల్లాలో స్కూళ్లకు సెలవు లేదు: DEO

చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు బుధవారం నుంచి యథావిధిగా పనిచేస్తాయని DEO వరలక్ష్మి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం సెలవు ప్రకటించడం జరిగిందని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని ఆమె తెలిపారు.


