News October 26, 2025
ఏలూరు: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాల నేపథ్యంలో ఏలూరు రూరల్ మారుతీ నగర్‌కు చెందిన కూలీ సుందరమతి దుర్గారావు (35) ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. 15 రోజుల కిందట భార్య పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లగా, మనస్తాపంతో శనివారం రాత్రి దుర్గారావు ఇంటి వద్ద ఉరి వేసుకున్నట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ తెలిపారు.
Similar News
News October 28, 2025
పెద్దపల్లి: ‘100% ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ చేయాలి’

PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని 100% ప్రారంభించి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మార్కింగ్ చేసిన ఇండ్లు కనీసం బేస్మెంట్ స్థాయికి చేరుకోవాలని, లబ్ధిదారులకు రుణ సమస్యలుంటే మహిళా సంఘాల ద్వారా సహాయం అందించాలని సూచించారు. నిర్మాణంలో ఆలస్యం చేసినవారి ఇండ్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. పనులను పర్యవేక్షించి, బిల్లుల చెల్లింపులు సమయానికి చేయాలని ఆదేశించారు.
News October 28, 2025
వనపర్తి: రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

వర్ష సూచన ఉన్న నేపథ్యంలో జిల్లాలో రైతులు పంట కోతలు చేపట్టకుండా వాయిదా వేసుకునేలా సూచించాలని వ్యవసాయ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. అలాగే ఇప్పటికే పంట కోత చేపట్టిన రైతులు తమ ధాన్యాన్ని తడవకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆరబోసుకునే విధంగా తగు సూచనలు చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News October 28, 2025
రాత్రి 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత

బాపట్ల జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అధిక వేగంతో గాలులు వీసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని చెప్పారు. కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు, నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.


