News October 26, 2025

WGL: లక్కు ఎవరికైనా.. కిక్కు అందరికీ ఉండాలి..!

image

మద్యం షాపులకు లక్కీ డ్రా సమయం మరో 24 గంటలు మాత్రమే ఉంది. ఇప్పటికే సిండికేట్‌గా మారి టెండర్లు దాఖలు చేసిన వ్యాపారులు ముందస్తు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. లైసెన్స్ దక్కిన వ్యక్తులు చేజారకుండా న్యాయపరంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా వరకు తమ మహిళల పేరుపై దరఖాస్తులు చేశారు. లక్కు ఎవరికైనా కిక్కు మాత్రం అందరికీ ఉండాలని, చేజారితే చిక్కులు తప్పవంటున్నారు.

Similar News

News October 28, 2025

మంగళవారం రాత్రికి తీరం దాటే అవకాశం: మంత్రి పార్థసారథి

image

తుఫాను సహాయక కార్యక్రమాల్లో ప్రభుత్వ ప్రతిష్ట ఇనుమడింపజేసేలా అధికార యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి పార్థసారథి అధికారులను ఆదేశించారు. మంగళవారం నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను మంగళవారం రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

News October 28, 2025

‘జగిత్యాలకు రూ.62.50 కోట్ల అభివృద్ధి నిధులు’

image

JGTL మున్సిపాలిటీకీ అత్యధికంగా రూ.62.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. CMను కలిసి వినతిపత్రం ఇచ్చిన వెంటనే నిధులు ఆమోదించారని చెప్పారు. ఇప్పటికే కరెంట్, డ్రైనేజీ, రోడ్లు, నీటి సరఫరా పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అర్బన్ హౌసింగ్ కాలనీకి రూ.20 కోట్లు ప్రతిపాదనలు పంపామని, జగిత్యాల జిల్లా అభివృద్ధిలో TGకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

News October 28, 2025

SRPT: ‘సమాజంలో శాస్త్రీయ వైఖరులు పెంపొందించాలి’

image

సమాజంలో శాస్త్రీయ వైఖరులు పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా అడిషనల్ కలెక్టర్ సీతారామారావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో చెకుముకి సైన్స్ సంబరాల గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. మూఢ నమ్మకాలను పారద్రోలి శాస్త్రీయ వైఖరులను పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు, సభ్యులు రామచంద్రయ్య దయానంద్ ఉన్నారు.