News October 26, 2025
6 నుంచి ఎంఏ తెలుగు సెకండియర్ ఇంటర్నల్స్

హనుమకొండలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో ఎంఏ తెలుగు సెకండియర్ మొదటి ఇంటర్నల్ పరీక్షలు వచ్చే నెల 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆ పీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న ఒక తెలిపారు. ఇతర వివరాల కోసం 99894 17299, 9989 139136 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Similar News
News October 28, 2025
పోలీస్ శాఖలో 11,639 ఖాళీలు

AP పోలీస్ శాఖలోని 13 కేటగిరీల్లో 11,639 ఖాళీలున్నట్లు హోంశాఖ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, మెకానిక్, డ్రైవర్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని పేర్కొంది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే స్పందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా అత్యధికంగా కానిస్టేబుల్(APSP) 4,587, కానిస్టేబుల్(సివిల్) 3,622, కానిస్టేబుల్(AR) 2000 ఖాళీలున్నాయి.
News October 28, 2025
అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ మన అందరి బాధ్యత: కలెక్టర్

అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా టోల్ ఫ్రీ నంబర్ 1064 గోడపత్రికను కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ జి.రాజకుమారి, జేసీ కొల్లాబత్తుల కార్తీక్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు ఎక్కడైనా అవినీతి ఘటనలు గమనించినప్పుడు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, సమర్థత పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
News October 28, 2025
NGKL: హాస్టల్‌లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్‌లో ఉంటున్న డిగ్రీ విద్యార్థిని స్ఫూర్తి(21) ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన మంగళవారం కలకలం రేపింది. ‘అమ్మానాన్న నన్ను క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్ రాసి పురుగుమందు తాగినట్లు గమనించిన తోటి విద్యార్థినీలు నిర్వాహకులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


