News October 26, 2025

జనగామ: ఏఎన్ఎం, అకౌంటెంట్ పోస్టుల దరఖాస్తులకు నేడే ఆఖరు

image

జిల్లాలోని కస్తూర్బాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఏఎన్ఎం, అకౌంటెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆదివారం ఆఖరు తేదీ అని ఇన్‌ఛార్జి డీఈవో పింకేశ్ కుమార్ తెలిపారు. రఘునాథపల్లి, తరిగొప్పుల కేజీబీవీల్లో ఒక్కో ఏఎన్ఎం పోస్టు, దేవరుప్పుల, నర్మెట్టలో ఒక్కో అకౌంటెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు నేడు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Similar News

News October 29, 2025

పాడేరు: ప్రతీ రెండు గంటలకు నివేదికలు అందజేయాలి

image

మట్టి గృహాలను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ముంపు ప్రభావిత ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. ప్రతీ రెండు గంటలకు నివేదికలు అందజేయాలన్నారు. తుఫాను ప్రభావంతో జిల్లాలో ఎక్కడ చిన్న సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. చేపడుతున్న చర్యలు గూగుల్ షీట్లో అప్లోడ్ చేయాలన్నారు.

News October 29, 2025

ఫ్రీ బస్సు ఇస్తే.. టికెట్ రేట్లు పెంచుతారా: నెటిజన్

image

TGSRTCలో టికెట్ రేట్లు విపరీతంగా పెరిగాయని ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు శంషాబాద్ TO ఎల్బీ నగర్ టికెట్ రూ.30-35 ఉంటే ఇప్పుడు (బీటెక్ థర్డ్ ఇయర్) రూ.60 అయింది. మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం మంచిదే. కానీ రేట్లు ఎందుకు ఇంతలా పెంచుతున్నారు’ అని ప్రశ్నించాడు. BRS, కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలూ RTC టికెట్ రేట్లను చాలా పెంచాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

News October 29, 2025

CM సాబ్‌తో ఆర్.నారాయణ మూర్తి మాట

image

యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో సినీ కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డిని ఆర్.నారాయణ ఆలింగనం చేసుకున్నారు. సినిమాలో డైలాగ్ చెప్పినట్లు, ఓ పాట పాడినట్లు ఆర్.నారాయణ మూర్తి తన శైలిలో CM రేవంత్‌‌తో ఏదో మాట్లాడారు.