News October 26, 2025
వరంగల్: యువకుడి సూసైడ్

ప్రేమించిన అమ్మాయి దక్కదనే ఆవేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. చెన్నరావుపేట మండలం ధర్మాతండాకు చెందిన బోడ మహేశ్(21) డిగ్రీ చదువుతున్నాడు. ఇదే మండలంలోని ఒక తండాకు చెందిన యువతిని మహేశ్ కొంతకాలంగా ప్రేమించడంతో తల్లిదండ్రులు యువకుడిని మందలించారు. దీంతో ఈ నెల 23న రాత్రి పురుగుమందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News October 29, 2025
పాడేరు: ప్రతీ రెండు గంటలకు నివేదికలు అందజేయాలి

మట్టి గృహాలను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ముంపు ప్రభావిత ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. ప్రతీ రెండు గంటలకు నివేదికలు అందజేయాలన్నారు. తుఫాను ప్రభావంతో జిల్లాలో ఎక్కడ చిన్న సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. చేపడుతున్న చర్యలు గూగుల్ షీట్లో అప్లోడ్ చేయాలన్నారు.
News October 29, 2025
ఫ్రీ బస్సు ఇస్తే.. టికెట్ రేట్లు పెంచుతారా: నెటిజన్

TGSRTCలో టికెట్ రేట్లు విపరీతంగా పెరిగాయని ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు శంషాబాద్ TO ఎల్బీ నగర్ టికెట్ రూ.30-35 ఉంటే ఇప్పుడు (బీటెక్ థర్డ్ ఇయర్) రూ.60 అయింది. మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం మంచిదే. కానీ రేట్లు ఎందుకు ఇంతలా పెంచుతున్నారు’ అని ప్రశ్నించాడు. BRS, కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలూ RTC టికెట్ రేట్లను చాలా పెంచాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
News October 29, 2025
CM సాబ్‌తో ఆర్.నారాయణ మూర్తి మాట

యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో సినీ కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డిని ఆర్.నారాయణ ఆలింగనం చేసుకున్నారు. సినిమాలో డైలాగ్ చెప్పినట్లు, ఓ పాట పాడినట్లు ఆర్.నారాయణ మూర్తి తన శైలిలో CM రేవంత్‌తో ఏదో మాట్లాడారు.


