News October 26, 2025
అతివలకు తోడుగా ఈ టోల్‌ఫ్రీ నంబర్లు

బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టి వారికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశాయి. గృహహింస, లైంగిక వేధింపులు, ఆడపిల్లల అక్రమరవాణా నిరోధించేందుకు 181, బాల్యవివాహాలను నిరోధించేందుకు 1098, వేధింపుల నియంత్రణకు షీటీం, ప్రసూతి సేవలకు అంబులెన్స్ కోసం 102, అంగన్‌వాడీ హెల్ప్‌లైన్ కోసం 155209 నంబర్లను అత్యవసర సమయాల్లో సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News October 26, 2025
టాస్ గెలిచిన భారత్

WWC: లీగ్ స్టేజిలో చివరి మ్యాచ్‌లో BANతో భారత్ తలపడుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన IND బౌలింగ్ ఎంచుకుంది. వర్షం పడుతుండటంతో ఆట కాస్త ఆలస్యమవనుంది.
IND: ప్రతీకా, స్మృతి, హర్లీన్, రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్(C), దీప్తి, ఉమా, అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీచరణి, రేణుకా
BAN: సుమియా, రుబ్యా హైదర్, షర్మిన్, శోభన, సుల్తానా(C), షోర్నా, మోని, రబేయా, నహిదా, నిషితా, మరుఫా
News October 26, 2025
నారద భక్తి సూత్రాలు – 8

నిరోధస్తు లోకవేదవ్యాపార వ్యప:
మనం చేసే సాధారణ పనులైనా, దేవుడికి సంబంధించిన పనులైనా.. వాటి ఫలితం గురించి ఆలోచించకుండా ‘దేవుడా! నీ కోసమే చేస్తున్నాను’ అని వాటిని ఆయనకు అప్పగించాలని ఈసూత్రం సూచిస్తోంది. ఫలితంగా మన మనసులో ఆందోళన, స్వార్థం పోతాయని, మన ప్రతి పని దైవసేవగా మారుతుందని చెబుతోంది. ‘నేను చేస్తున్నాను’ అనే అహంకారం వదిలి ‘అంతా దేవుడే చేయిస్తున్నాడు’ అనే నమ్మకంతో ఉండటమే ఈ సూత్ర సారాంశం. <<-se>>#NBS<<>>
News October 26, 2025
విషాదం: మట్టిపెళ్లలు విరిగిపడతాయని పంపిస్తే..

కేరళలోని ఇడుక్కి జిల్లాలో దంపతులను దురదృష్టం వెంటాడింది. NH-85 విస్తరణ పనుల్లో భాగంగా మన్నంకందంలో కొండను తవ్వుతున్నారు. మట్టిపెళ్లలు విరిగిపడే అవకాశం ఉందని 22 కుటుంబాలను నిన్న సాయంత్రం రిలీఫ్ క్యాంపులకు తరలించారు. అయితే రాత్రికి భోజనం కోసం బిజు(48), సంధ్య దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు. ఈ సమయంలో మట్టి, బురద ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయి. బిజు చనిపోగా, సంధ్య తీవ్రంగా గాయపడ్డారు.


