News October 26, 2025

ఆధార్ వివరాలివ్వని ఉద్యోగుల జీతాలు కట్.. ఆర్థిక శాఖ ఉత్తర్వులు

image

TG: ఆధార్ వివరాలు ఇవ్వని ఉద్యోగులకు ఈ నెల జీతాన్ని ఆపేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలిచ్చింది. ఉద్యోగుల వివరాలను సమర్పించేందుకు ఈ నెల 25 వరకు రెండు సార్లు గడువు పొడిగించినా స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 5.21 లక్షల మంది రెగ్యులర్, 4.93 లక్షల మంది టెంపరరీ ఉద్యోగులు పని చేస్తున్నారు. శనివారం రాత్రి నాటికి టెంపరరీ ఉద్యోగుల్లో 3.75 లక్షల మంది వివరాలను IFMIS పోర్టల్‌లో నమోదు చేసినట్లు సమాచారం.

Similar News

News October 26, 2025

మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ టిప్స్ పాటించండి

image

అందంగా కనిపించాలని ముఖంపై పెట్టే శ్రద్ధ చాలామంది కాళ్లు, చేతులపై పెట్టరు. దీంతో మోచేతులు, మోకాళ్లు నల్లగా మారతాయి. దీన్ని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. రోజూ కలబంద గుజ్జును మోచేతులు, కాళ్లకి రాస్తుంటే నలుపుదనం తగ్గుతుంది. స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో కాస్త పంచదార వేసి దాంతో చేతులు, కాళ్లని స్క్రబ్ చేసి, 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి చర్మానికి రాసినా సమస్య తగ్గుతుంది.

News October 26, 2025

తుఫాను ఎఫెక్ట్.. TGలోనూ భారీ వర్షాలు

image

TGలోనూ ‘మొంథా’ ఎఫెక్ట్ ఉండొచ్చని HYD వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈనెల 28న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈనెల 29న ADB, కొమురంభీం, మంచిర్యాల, NRML, PDPL, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.

News October 26, 2025

తుఫాను.. సెలవులపై కాసేపట్లో నిర్ణయం!

image

AP: ‘మొంథా’ తుఫాను ప్రభావం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉండనుంది. దీంతో సోమవారం నుంచి చాలా జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది ఇదే పెద్ద తుఫాను కావడంతో CM ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సెలవులిచ్చారు. ఈ సాయంత్రం విద్యాశాఖ కమిషనర్ సమీక్ష నిర్వహించి ఏయే జిల్లాల్లో సెలవులివ్వాలి, తల్లిదండ్రులకు మెసేజులు పంపాలనే దానిపై చర్చించనున్నారు.