News October 26, 2025

శ్రీ చైతన్యలో స్కాలర్‌షిప్‌ టెస్ట్.. లాప్‌టాప్‌ బహుమతి

image

పేద విద్యార్థులకు ఫీజు రాయితీతో కార్పొరేట్ విద్య అందించేందుకు శ్రీ చైతన్య ఐఐటీ-జేఈఈ & నీట్ అకాడమీ స్కాలర్‌షిప్ టెస్ట్‌ను నవంబర్ 2న నిర్వహించనుంది. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతుంది. మొదటి బహుమతిగా లాప్‌టాప్, 2 నుంచి 10వ ర్యాంకు వారికి ట్యాబ్‌లు ఇస్తారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌లు ప్రారంభమయ్యాయి. వివరాలకు 98485 87584 నంబర్‌ను సంప్రదించాలని అకాడమీ డైరెక్టర్‌ రవికిరణ్ తెలిపారు.

Similar News

News October 26, 2025

కవిత ఆరోపణలు.. బీఆర్ఎస్ నేతలు స్పందిస్తారా?

image

నిజామాబాద్‌లో జాగృతి జనంబాట కార్యక్రమంలో కవిత సంచలన ఆరోపణలు చేశారు. తన ఓటమికే <<18110074>>BRS ఎమ్మెల్యేలే<<>> కారణమని ఆరోపించారు. అంతేగాక తన ఓటమికి కొందరు <<18102361>>కుట్ర పన్నరాని<<>> పేర్కొన్నారు. ఇంతకి ఎవరా ఎమ్మెల్యేలు అనే చర్చ జిల్లాలో మెుదలైంది. పార్టీకి వ్యతిరేకంగా ఏం చేయకున్నా BRS నుంచి తనను బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కవిత వ్యాఖ్యలపై BRS నేతలు స్పందిస్తారా? మౌనాన్ని పాటిస్తారా వేచి చూడాలి.

News October 26, 2025

మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ టిప్స్ పాటించండి

image

అందంగా కనిపించాలని ముఖంపై పెట్టే శ్రద్ధ చాలామంది కాళ్లు, చేతులపై పెట్టరు. దీంతో మోచేతులు, మోకాళ్లు నల్లగా మారతాయి. దీన్ని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. రోజూ కలబంద గుజ్జును మోచేతులు, కాళ్లకి రాస్తుంటే నలుపుదనం తగ్గుతుంది. స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో కాస్త పంచదార వేసి దాంతో చేతులు, కాళ్లని స్క్రబ్ చేసి, 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి చర్మానికి రాసినా సమస్య తగ్గుతుంది.

News October 26, 2025

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి: యూటీఎఫ్‌

image

పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జ్ఞానమంజరి డిమాండ్‌ చేశారు. సంగారెడ్డిలోని కేకే భవన్‌లో ఆదివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి తరగతికి ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి సాయిలు తదితరులు పాల్గొన్నారు.