News October 26, 2025
జనగామ: విధుల్లో చేరిన డీఐఈఓ జితేందర్ రెడ్డి

తన వ్యక్తిగత పనుల నిమిత్తం వారం రోజుల పాటు సెలవుపై వెళ్లిన జనగామ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కె.జితేందర్ రెడ్డి విధుల్లో చేరారు. ఆయన సెలవుల్లో ఉన్నప్పుడు ఇన్‌ఛార్జి డీఐఈవోగా ఎస్.శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లాలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జరిగిన సిలబస్ పై ఆరా తీస్తున్నారు. త్వరగా పూర్తి చేసి రివిజన్ చేయాలని ఆదేశించారు.
Similar News
News October 26, 2025
వైద్యురాలు ఆత్మహత్య.. BJPపై రాహుల్ ఫైర్

మహారాష్ట్రలో SI రేప్ చేశాడని వైద్యురాలు <<18091644>>సూసైడ్<<>> చేసుకోవడంపై LoP రాహుల్‌గాంధీ స్పందించారు. ‘ఎలాంటి సివిలైజ్డ్ సొసైటీనైనా కదిలించే విషాదమిది. అవినీతి వ్యవస్థలో స్థిరపడిన క్రిమినల్స్ చేతిలో ఆమె బలైంది. ప్రజలను రక్షించాల్సినవారే ఘోరానికి పాల్పడ్డారు. దీని వెనుక BJP నేతలు, సంపన్నులు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ అమానవీయ ముఖాన్ని ఇది బయటపెట్టింది. దేశంలోని ప్రతి ఆడబిడ్డకు అండగా ఉంటాం’ అని ట్వీట్ చేశారు.
News October 26, 2025
వర్గీకరణ మార్కింగ్ 29లోపు పూర్తి కావాలి: జిల్లా కలెక్టర్

భూ కమతాల వర్గీకరణ మార్కింగ్ ప్రక్రియను ఈనెల 29వ తేదీలోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిరి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల, డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులతో భూకమతాల వర్గీకరణ, ఈ పంట నమోదు, పత్తి, ఉల్లి పంటల హార్వెస్టింగ్‌పై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడువులోగా ఈ పంట నమోదు కూడా పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News October 26, 2025
JNTU: OTPRIలో 31న ప్రాంగణ నియామకాలు

అనంతపురం జేఎన్టీయూ OTPRIలో ఈ నెల 31న ఉదయం 9:00 గంటలకు B.Pharm, M.Pharm విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నట్లు OTPRI డైరెక్టర్ సుబ్బారెడ్డి, ప్రిన్సిపల్ సి.గోపినాథ్ ఆదివారం తెలిపారు. 2022-25లో గ్రాడ్యుయేషన్ (B.Pharm, M.Pharm) పూర్తి చేసుకునే విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని తెలిపారు.


