News October 26, 2025
కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న నగరం

బొల్లారం, బాచుపల్లి, మియాపూర్, అమీన్‌పూర్ పారిశ్రామికవాడలోని ఆయిల్, కెమికల్ కంపెనీల కారణంగా ఈ ప్రాంతాల్లో గాలి విషపూరితంగా మారుతోందని ప్రజలు వాపోతున్నారు. వీటినుంచి విడుదలవుతున్న వాయువులను పీల్చలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సంబంధిత అధికారులు మౌనం వ్రతం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News October 26, 2025
అత్యధిక రన్స్ చేసిన భారత ఓపెనర్‌గా రోహిత్

నిన్న ఆస్ట్రేలియాపై సెంచరీతో అదరగొట్టిన రోహిత్ అరుదైన రికార్డు సాధించారు. భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన ఓపెనర్‌గా నిలిచారు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగమించారు. రోహిత్ 15,787 రన్స్ చేయగా, ఆ తర్వాత సెహ్వాగ్ (15,758), సచిన్ (15,335) పరుగులు చేశారు. రోహిత్ 2007లోనే భారత్ తరఫున అరంగేట్రం చేసినా అంతగా రాణించలేదు. 2013లో ఓపెనర్ అవతారం ఎత్తాక రికార్డులు కొల్లగొట్టారు.
News October 26, 2025
మెదక్: నేడు స్వగ్రామానికి మృతదేహాలు

కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన తల్లీ, కూతురు మృతదేహాలు ఇవాళ రాత్రి వరకు స్వగ్రామానికి రానున్నాయి. మెదక్ మండలం శివాయిపల్లికి చెందిన మంగ సంధ్యారాణి(43), కుమార్తె చందన(23) బస్సు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. DNA పరీక్షల అనంతరం మృతదేహాలను ఇవాళ సాయంత్రం కుటుంబీకులకు అప్పగించారు. రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా శుక్రవారం నుంచి శివ్వాయిపల్లిలో విషాదం నెలకొంది.
News October 26, 2025
NGKL: దరఖాస్తుదారులు ఉదయం 9 గంటలకు రావాలి

నాగర్‌కర్నూల్ జిల్లాలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారులు ఉదయం 9 గంటల వరకు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని ఎంట్రీ పాస్‌లు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారి ఆదివారం పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆధ్వర్యంలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీడీప్ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. వ్యాపారులు సకాలంలో హాజరుకావాలని కోరారు.


