News October 26, 2025

ASF: ఢిల్లీకి చేరిన జాబితా.. ఎవరి ధీమా వారిదే!

image

తెలంగాణ రాష్ట్ర డీసీసీల జాబితా ఢిల్లీకి చేరింది. CM రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో డీసీసీల జాబితాను ఢిల్లీ పెద్దలకు అందజేశారు. ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ పదవిపై ఎవరి ధీమా వారికే ఉంది. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ఎవరికి వారే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News October 26, 2025

ఊట్కూర్: సమాచారం ఇవ్వని అధికారులకు RTI నోటీసులు

image

బతుకమ్మ చీరల పంపిణీ వివరాలు ఇవ్వకపోవడంతో నారాయణపేట జిల్లా డీఆర్‌డీఏ పీడీ, ఊట్కూర్ ఐకేపీ ఏపీఎంలకు రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటలకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. 2022 నుంచి ఊట్కూర్ మండల పరిధిలో గ్రామాల వారీగా చీరల పంపిణీ వివరాలు కోరుతూ డీడీ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసినా సమాచారం ఇవ్వలేదని RTI ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నర్సింలు తెలిపారు.

News October 26, 2025

రేపు భద్రాచాలం ఐటీడీఏలో ‘గిరిజన దర్బార్’

image

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం ‘గిరిజన దర్బార్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీఓ రాహుల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు వారి సమస్యలను లిఖితపూర్వకంగా అధికారులకు అందజేయవచ్చని పేర్కొన్నారు. ఉదయం 10:30 గంటలకు ఐటీడీఏ సమావేశ మందిరంలో ఈ దర్బార్ జరుగుతుందని, అన్ని శాఖల యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఆయన సూచించారు.

News October 26, 2025

మేడ్చల్: రేపు లక్కీగా వైన్స్ దక్కేదెవరికి?

image

రేపు శ్రీ పలనీ కన్వెన్షన్‌లో ఉ.11 గంటలకు మేడ్చల్-మల్కాజిగిరి యూనిట్లకు సంబంధించి నూతన మద్యం పాలసీ 2025-27కు డ్రా తీయడం జరుగుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మేడ్చల్ యూనిట్‌లోని 118, మల్కాజిగిరి యూనిట్‌లోని 88 మద్యం షాపులకు జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా తీయడం జరుగుతుంది. దరఖాస్తుదారులు, అధికార ప్రతినిధులు తప్పని సరిగా హాజరుకావాలని సూచించారు. లక్కీ డ్రాలో టెండర్‌ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.