News October 26, 2025
విద్యాసంస్థలకు సెలవులపై కలెక్టర్లకు సీఎం ఆదేశం

AP: తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని, ఎక్కడా ప్రాణ-ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబు ఆదేశించారు. SMS, సోషల్ మీడియా, IVRS కాల్స్, వాట్సాప్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. విద్యుత్, టెలికం, తాగునీటి సరఫరా నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు కలెక్టర్లు <<18106376>>సెలవులు<<>> ప్రకటించాలని టెలికాన్ఫరెన్స్‌లో చెప్పారు.
Similar News
News October 26, 2025
భారీ వర్ష సూచన.. మరికొన్ని జిల్లాల్లో సెలవులు

AP: రేపట్నుంచి మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన నేపథ్యంలో మరికొన్ని జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ప్రకాశం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో 27, 28, 29 తేదీల్లో హాలిడేస్ ఇచ్చారు. విశాఖ, ఏలూరు జిల్లాలో 27, 28 తేదీల్లో.. చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో 27న సెలవులిస్తూ డీఈవోలు ప్రకటించారు. ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు <<18106376>>హాలిడేస్ ప్రకటించిన<<>> విషయం తెలిసిందే.
News October 26, 2025
వరల్డ్ కప్ ఆడటమే రోహిత్ లక్ష్యం: కోచ్

స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రచారాన్ని అతడి చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ కొట్టిపారేశారు. హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పారు. 2027 వరల్డ్ కప్ వరకు ఆడటమే రోహిత్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆ తర్వాతే రిటైర్ అవ్వాలని నిశ్చయించుకున్నారని తెలిపారు. మరోవైపు AUSలో చివరి మ్యాచ్ ఆడేశానంటూ రోహిత్ SMలో పోస్ట్ చేశారు. ‘వన్ లాస్ట్ టైమ్.. సైనింగ్ ఆఫ్ ఫ్రం సిడ్నీ’ అని క్యాప్షన్ ఇచ్చారు.
News October 26, 2025
ఇతిహాసాలు క్విజ్ – 47 సమాధానాలు

1. దశరథ మహారాజు కుల గురువు ‘వశిష్ఠుడు’.
2. ఉలూచి, అర్జునుల కుమారుడు ‘ఇరావంతుడు’.
3. దేవతల తల్లి ‘అధితి’.
4. శివుడు నర్తించే రూపం పేరు ‘నటరాజ’.
5. సత్య హరిశ్చంద్రుడి భార్య పేరు ‘చంద్రమతి’.
<<-se>>#Ithihasaluquiz<<>>


