News October 26, 2025
సోనియా రాష్ట్రాన్ని ఇస్తే BRS దోచుకుంది: కోమటిరెడ్డి

TG: సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇస్తే BRS నేతలు పదేళ్లు దోచుకుతిన్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ‘దోపిడీ భరించలేక ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. పదేళ్లు సీఎంగా ఉన్న KCR మా అభ్యర్థి నవీన్ యాదవ్ గురించి మాట్లాడాడు అంటే మా విజయం అక్కడే అర్థం అవుతుంది. నవీన్ రౌడీ అయితే గత ప్రభుత్వంలో ఎన్ని కేసులు ఉన్నాయో BRS నేతలు బయటపెట్టాలి’ అని ప్రచారంలో డిమాండ్ చేశారు.
Similar News
News October 26, 2025
మహిళల కోసం మెప్మా కొత్త కార్యక్రమాలు

ఏపీలో లక్షమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. MEPMA ద్వారా చేపట్టే 8 కార్యక్రమాలు మహిళ పారిశ్రామిక వేత్తలకు మార్గదర్శకం కానున్నాయి. పారిశ్రామిక వేత్తలుగా రాణించేందుకు, ప్రోత్సహించేందుకు అవసరమైన సమాచార పుస్తకాలు ప్రభుత్వం రూపొందించింది. వీటిని మహిళా సాధికారత, డిజిటల్ శిక్షణ, స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించారు.
News October 26, 2025
WC జర్నీ.. RO-KO ఆడే సిరీస్‌లు ఎన్నంటే?

AUS సిరీస్ 3వ వన్డేలో భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ వరకు కొనసాగుతామన్న సంకేతాలిచ్చారు. అప్పటి వరకు మరో 8 వన్డే సిరీస్‌ల్లో RO-KO షో చూసే అవకాశముంది. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, WI, శ్రీలంకతో స్వదేశంలో, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో ఆయా దేశాల్లో టీమ్‌ఇండియా 3 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. వీటితో పాటు ఆసియా కప్‌లోనూ వీరు మెరిసే అవకాశముంది.
News October 26, 2025
తాజా వార్తలు

☛ WWC: వర్షం వల్ల భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌కు అంతరాయం
☛ రేపు 4.15PMకు భారత ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్.. దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అమలుపై ప్రకటించే ఛాన్స్
☛ కర్నూలు ప్రమాదం: DNA పరీక్షలో 19వ వ్యక్తి మృతదేహం గుర్తింపు.. చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తులు అని అధికారుల ప్రకటన
☛ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ సమాప్తం: మంత్రి తుమ్మల


