News October 26, 2025

సిరిసిల్ల: TG BC ఫెడరేషన్ జిల్లాధ్యక్షుడిగా కిషన్

image

తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన ఎర్రోజు కిషన్‌ను రాష్ట్ర అధ్యక్షుడు బెల్లాపు దుర్గారావు నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నియామక పత్రం అందుకున్న కిషన్.. తన నియామకానికి సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ ఫెడరేషన్ ఎదుగుదలకు కృషి చేస్తానని కిషన్ మాటిచ్చారు.

Similar News

News October 26, 2025

నెల్లూరు: గిరిజనుల ఇళ్ల నిర్మాణానికి సర్వే

image

నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్లా ఆదేశాలతో మనుబోలు మండలం- పల్లిపాలెం గ్రామంలో గిరిజనుల ఇళ్ల నిర్మాణం కోసం ఆదివారం హౌసింగ్ అధికారులు సర్వే నిర్వహించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు తమకు ఇల్లు లేవని గిరిజనులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సర్వేచేసి అర్హులైన వారందరికీ ఇళ్లు నిర్మిస్తామని హౌసింగ్ ఏఈ శరత్‌బాబు తెలిపారు.

News October 26, 2025

మహిళల కోసం మెప్మా కొత్త కార్యక్రమాలు

image

ఏపీలో లక్షమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. MEPMA ద్వారా చేపట్టే 8 కార్యక్రమాలు మహిళ పారిశ్రామిక వేత్తలకు మార్గదర్శకం కానున్నాయి. పారిశ్రామిక వేత్తలుగా రాణించేందుకు, ప్రోత్సహించేందుకు అవసరమైన సమాచార పుస్తకాలు ప్రభుత్వం రూపొందించింది. వీటిని మహిళా సాధికారత, డిజిటల్ శిక్షణ, స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించారు.

News October 26, 2025

NTR: డెంగీ జ్వరం కాదు.. లంగ్స్ ఇన్ఫెక్షన్‌తోనే ఉద్యోగి మృతి.!

image

విజయవాడ 61 డివిజన్ ప్రశాంతినగర్‌కు చెందిన CRPగా పనిచేస్తున్న శివదుర్గ అనే మహిళ డెంగీతో చనిపోలేదని డిప్యూటీ DMHO ఇందుమతి తెలిపారు. ఇటీవల నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దగ్గు, తలనొప్పి, జ్వరం, కడుపు నొప్పితో శివదుర్గ అడ్మిట్ అయ్యారని.. 4 రోజులు ట్రీట్మెంట్ పొందిన తర్వాత పరిస్థితి విషమించి చనిపోయినట్లు చెప్పారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ కారణంగానే చనిపోయిందని.. డెంగీ వల్ల కాదని స్పష్టం చేశారు.