News October 26, 2025

ఏలూరు: రెండు రోజులు విద్యా సంస్థలకు సెలవులు

image

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఏలూరు జిల్లాలో అక్టోబర్ 27, 28వ తేదీల్లో పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించారు. తుఫాన్ కారణంగా తీవ్ర గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ వెట్రి సెల్వి ఆదివారం తెలిపారు. ప్రైవేట్ యాజమాన్యాలు అదనపు తరగతులు లేదా స్టడీ క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

Similar News

News October 26, 2025

భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: WGL కలెక్టర్

image

భూభారతికి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో వర్ధన్నపేట, దుగ్గొండి మండలాల భూభారతి, పీఓటీ రికార్డులపై ఆమె సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌ను వేగవంతం చేయాలని, దరఖాస్తులను తిరస్కరించే పక్షంలో అందుకు స్పష్టమైన కారణాలను తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.

News October 26, 2025

కర్నూలు దుర్ఘటన.. చివరి నిమిషంలో బస్సెక్కి మృతి

image

AP: కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన 19వ వ్యక్తి చిత్తూరు(D)కు చెందిన త్రిమూర్తి అని తేలింది. ఆయన రిజర్వేషన్ లేకున్నా ఆరాంఘర్‌(HYD)లో బస్సెక్కారు. తన ఫోన్ కలవకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారి DNA శాంపిల్స్ పరీక్షించగా చనిపోయింది త్రిమూర్తేనని తేలింది. TGకి చెందిన తరుణ్ రిజర్వేషన్ చేసుకున్నా చివరి నిమిషంలో బస్సెక్కకుండా ప్రాణాలు కాపాడుకోగా త్రిమూర్తిని మృత్యువు వెంటాడింది.

News October 26, 2025

కాకినాడ: రామురామంటూనే.. ఎట్టకేలకు తిరిగొచ్చారు.!

image

తుపాన్ నేపథ్యంలో తాళ్లరేవు మండలం హోప్ ఐలాండ్‌లో ఉన్న 110 మంది మత్స్యకారులను తీసుకువచ్చేందుకు కాకినాడ ఆర్డీఓ, పోలీసులు సహా 20 మంది అధికారులు ఆదివారం ఉదయం వెళ్లారు. మొదట తాము రామని మత్స్యకారులు చెప్పినా, అధికారులు ఎట్టకేలకు వారికి నచ్చజెప్పారు. సాయంత్రం అందరూ తూరంగిలోని హోప్ ఐలాండ్ కాలనీకి సురక్షితంగా తిరిగి రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.