News October 26, 2025
పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో ఇద్దరి హత్య.. చర్ల సరిహద్దులో ఘటన

తెలంగాణ సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. కాంకేర్ గ్రామానికి చెందిన కట్టాం రవి, సోడి తిరుపతిలను పదునైన ఆయుధాలతో హత్య చేశారు. ఇన్ఫార్మర్లనే కారణమంటూ ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 26, 2025
తులసి మొక్క ఇంటికి ఏ దిశలో ఉండాలి?

ప్రతి ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ‘తులసి ప్రశాంతతను పెంచుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ మొక్క సూర్యునికి అభిముఖంగా, తూర్పు దిశలో ఉండటం శ్రేయస్కరం. ఉత్తరంలోనూ ఉండొచ్చు. ఆరోగ్యాన్ని పెంపొందించుకోడానికి ఉదయం కొంత సమయం తులసి దగ్గర గడపాలి. ఈ మొక్క ఎదుగుదల ఇంట్లోవారికి కొన్ని సూచనలిస్తుంది’ అని పేర్కొన్నారు. <<-se>>#Vasthu<<>>
News October 26, 2025
చంచల్‌గూడ జైలుకు 150 ఏళ్ల చరిత్ర

చంచల్‌గూడ జైలు 1876లో నిర్మించబడింది. ఈ జైలుకు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం కాలంలో పాలనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని నేరస్తులుగా ముద్ర వేసి క్రమశిక్షణ పేరుతో అణచివేయడం జరిగేది. నవాబులు తమకు విరోధంగా ఉన్నవారిని ఇక్కడ నిర్బంధించేవారు. అప్పట్లో 70 ఎకరాల్లో విస్తరించిన ఈ జైలు కాలక్రమంలో సంస్కరణలు, నగర విస్తరణ కారణంగా ప్రస్తుతం సుమారు 30 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది.
News October 26, 2025
సిద్దిపేట: ప్రశాంతంగా లైసెన్సుడ్ సర్వేయర్ పరీక్షలు

లైసెన్సుడ్ సర్వేయర్ స్పెల్- 2 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. లైసెన్సుడ్ సర్వేయర్ల కోసం దరఖాస్తు చేసుకుని రెండు నెలల శిక్షణ పొందారు. శిక్షణ అనంతరం ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పరీక్షా సెంటర్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు.


