News October 26, 2025
జలమండలి ప్రాజెక్ట్.. 61 సర్వీస్ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి

జలమండలి పరిధిలో రిజర్వాయర్లను పూర్తి చేయడం కోసం కసరత్తు చేస్తున్నట్లు HMWSSB అధికారులు తెలిపారు. ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్డు వరకు 71 రిజర్వాయర్లలో ఇప్పటికే, 61 పూర్తి చేసి, మిగిలినవి వివిధ దశలో ఉన్నట్లు ప్రత్యేక నోటీసు విడుదల చేశారు. త్వరలోనే వాటిని సైతం పూర్తి చేసి, పూర్తిస్థాయిలో నీటి సరఫరా కోసం చర్యలు చేపడతామన్నారు.
Similar News
News October 26, 2025
వనపర్తిలో పోలీసుల సైకిల్ ర్యాలీ

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ఉంటుందని వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి తెలిపారు. సైకిల్ ర్యాలీని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గిరిధర్ ప్రారంభించి పోలీస్ అధికారులతో కలిసి సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొంటారని అన్నారు. ఈ ర్యాలీ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు సాగుతుందన్నారు.
News October 26, 2025
చల్వాయి, గోవిందరావుపేట షాపులకు డ్రా నిలిపివేత..!

ములుగు జిల్లాలోని చల్వాయి, గోవిందరావుపేట మద్యం దుకాణాలకు డ్రాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భూపాలపల్లి ఈఎస్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం భూపాలపల్లి, ములుగు జిల్లాలోని షాపులకు డ్రా జరుగుతోందని, కానీ ప్రోహిబిషన్& ఎక్సైజ్ కమిషనర్ ఉత్తర్వులు మేరకు ఈ రెండు దుకాణాలకు డ్రా నిలిపివేసినట్లు వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని తెలిపారు.
News October 26, 2025
తుఫాన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: మంత్రి అచ్చెన్నాయుడు

మొంథా తుఫాన్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 27, 28, 29వ తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం మన్యం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.


