News October 26, 2025

కొండారెడ్డిపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదు

image

జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలో వర్షం కురిసింది. అత్యధికంగా బల్మూరు మండలం కొండారెడ్డిపల్లిలో 38.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లింగల 32.8, కొండనాగుల, పెద్దుర్ 32.0, పదర 20.5, అచ్చంపేట 18.8, తిమ్మాజిపేట17.5, వంకేశ్వర్ 16.8, మంగనూర్ 4.5, యంగంపల్లి 3.5, తెల్కపల్లి 2.8, అత్యల్పంగా సిర్సనగండ్ల, ఐనోల్‌లో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

Similar News

News October 26, 2025

NGKL: రేపే మద్యం దుకాణాల కేటాయింపు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డీప్ ద్వారా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టనున్నారు. మద్యం దుకాణాల కోసం జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న వ్యాపారులలో టెన్షన్ మొదలైంది. జిల్లాలోని 67 మద్యం దుకాణాలకు గాను 1,518 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రేపు ఉదయం 11 గంటలకు లక్కీ డీప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు.

News October 26, 2025

రేపు ఉదయం 11గంటలకు..

image

TG: మద్యం దుకాణాల లైసెన్స్‌ల ఎంపిక లాటరీ పద్ధతిలో రేపు ఉదయం 11గంటలకు ప్రారంభం కానుంది. కలెక్టర్ల చేతుల మీదుగా లక్కీ డ్రా నిర్వహణ జరగనుంది. మద్యం దుకాణాల లాటరీ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా శంషాబాద్‌లో 100 మద్యం దుకాణాలకు 8,536 దరఖాస్తులు రాగా, సరూర్‌నగర్‌లో 134 మద్యం షాపులకు 7,845 అప్లికేషన్లు వచ్చాయి.

News October 26, 2025

MBNR: రేపు నూతన మద్యం షాపులకు లక్కీ డ్రా

image

మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలో 2025–27 మద్యం పాలసీకి సంబంధించిన A4 మద్యం షాపుల లైసెన్స్‌దారుల ఎంపిక సోమవారం లాటరీ పద్ధతిలో జరుగుతుంది. మహబూబ్‌నగర్ కలెక్టర్ ఆఫీస్‌లోని ప్రజావాణి హాల్‌లో ఈ డ్రా నిర్వహించనున్నట్లు నారాయణపేట ఎక్సైజ్ అధికారి అనంతయ్య తెలిపారు. మొత్తం 90 మద్యం షాపుల కోసం మొత్తం 2,487 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఉదయం 9 లోపు దరఖాస్తుదారులు, సంబంధిత రసీదు, ప్రవేశ పత్రం తీసుకురావాలన్నారు.