News October 26, 2025

రేపు PGRS రద్దు: కలెక్టర్

image

సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం తెలిపారు. మొంథా తుపాన్‌ కారణంగా సోమవారం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ప్రజా రక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. తుపాను పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News October 26, 2025

నెల్లూరు జిల్లాలో రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు పడునున్న నేపథ్యంలో రేపు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సెలవు ప్రకటించారు. అంతే కాకుండా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి RIO వర ప్రసాదరావు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు కూడా రేపు సెలవు ప్రకటించారు.

News October 26, 2025

నెల్లూరు: గిరిజనుల ఇళ్ల నిర్మాణానికి సర్వే

image

నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్లా ఆదేశాలతో మనుబోలు మండలం- పల్లిపాలెం గ్రామంలో గిరిజనుల ఇళ్ల నిర్మాణం కోసం ఆదివారం హౌసింగ్ అధికారులు సర్వే నిర్వహించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు తమకు ఇల్లు లేవని గిరిజనులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సర్వేచేసి అర్హులైన వారందరికీ ఇళ్లు నిర్మిస్తామని హౌసింగ్ ఏఈ శరత్‌బాబు తెలిపారు.

News October 26, 2025

కందుకూరులో వృద్ధ దంపతుల ఆత్మహత్య

image

కందుకూరులో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని కోవూరు రోడ్డులో నివసిస్తున్న వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం పురుగు మందు తాగిన ఇద్దరిని కందుకూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఒకరు మరణించారని తెలిసింది. చికిత్స పొందుతూ మరొకరు కూడా మరణించారని సమాచారం. వృద్ధ దంపతుల ఆత్మహత్యకు కారణం ఏమిటన్నది విచారణలో తేలాల్సి ఉంది.